ఢిల్లీలోని లిక్కర్ స్కాంకు నాకు ఎటువంటి సంబంధం లేదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికపక్ష పార్టీల మీద అధికారిక బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదు.నిరాధారంగా మాట్లాడటం ఆరోగ్యకరమైన పద్దతి కాదు కేసిఆర్ బిడ్డను బద్నాం చేస్తే, కేసీఆర్ ఆగమైతడని, కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్న కేసీఆర్ భయపడుతారేమో అని, బీజేపీ నేతలు ఇలాంటి వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది పూర్తి వ్యర్థ ప్రయత్నంగానే మిగిలిపోతుంది.తెలంగాణ కోసం ఉద్యమించిన అన్ని సంవత్సరాలలో, మా కుటుంబ సభ్యుల మీద అనేక ఆరోపణలు చేసినా, మొక్కవొని ధైర్యంతో, మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వ్యక్తులం.
ఇటువంటి వాటికి భయపడేది లేదు.భారతదేశం ఎలా అభివృద్ధి చెందాలి అనే కలతో, ఎజెండాతో సీఎం కేసీఆర్ గారు ముందుకెళ్తున్నారు.
మేమంతా వారు చూపించిన బాటలోనే నడుస్తాం భయపడేది లేదు… బిల్కిస్ బానో, ఉద్యోగాలు లాంటి విషయాలపై జవాబు చెప్పకుండా, ప్రతిపక్షాల మీద ఇలాంటి ఆరోపణలతో బురద చల్లాలనే వైఖరి బాగాలేదు.దీన్ని ప్రజలంతా గమనించాలి
.






