నువ్వు షన్ను కలిసిపోయినట్టు కల వచ్చింది.. దీప్తి సునైనకు నెటిజన్ షాక్!

యూట్యూబర్ గా మంచి పేరు సంపాదించుకున్న దీప్తి సునయన గురించి అందరికి పరిచయమే.ముఖ్యంగా బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరై ఎంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

 I Had A Dream That Deepthi Sunaina Together With Shanmukh Netizen Comments Viral-TeluguStop.com

హౌస్ లో ఉన్నంత కాలం బాగా అల్లరి చేస్తూ, ఎమోషనల్ తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

మొదట డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ఇక యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో బాగా మెప్పించి మరింత గుర్తింపు అందుకుంది.బిగ్ బాస్ లో అవకాశం అందుకోగా తన కెరీర్ మొత్తం బిగ్ బాస్ తో మొదలైందని చెప్పవచ్చు.

ఇక బిగ్ బాస్ తర్వాత పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.

చాలా వరకు మంచి సక్సెస్ లు అందుకుంది.

మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇదంతా పక్కన పెడితే దీప్తి సునయన మరో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా చేసింది.

ఇక వీరిద్దరూ కలిసి కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేశారు.దీంతో వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఏర్పడింది.

దాంతో అది లవ్ గా మారింది.

అలా కొంతకాలం వీరిద్దరూ తమ ప్రేమను బయటకు పెట్టకపోగా.బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో షణ్ముఖ్ కంటెస్టెంట్ గా పాల్గొన్నప్పుడు ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని బయటపడింది.ఏ వేదిక మీద అయితే వారి ప్రేమ బయటపడిందో ఆ వేదిక ద్వారానే వారి ప్రేమకు ముగింపు పలికింది.

కారణమేంటంటే సీజన్ ఫైవ్ లో పాల్గొన్న షణ్ముఖ్ మరో కంటెస్టెంట్ సిరి తో మితిమీరి ప్రవర్తించడంతో ఇక షన్ను తో తన రిలేషన్ కరెక్ట్ కాదని బ్రేకప్ చెప్పుకుంది దీప్తి.ఇక ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

చాలావరకు వీరిద్దరి విడిపోవటంతో ఎవరు జీర్ణించుకోలేకపోయారు.

దీప్తి కూడా మొదట్లో బాగా ఎమోషనల్ అయ్యింది.రాను రాను రీ ఫ్రెష్ అయ్యి స్ట్రాంగ్ అయింది.ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని కొటేషన్స్ పెడుతూ ఉంటుంది.

చాలా వరకు అవి షన్ను ని ఉద్దేశించి పెడుతుంది అని అనుకుంటుంటారు.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక వీడియో షేర్ చేసుకుని.

అందులో ఒక పాటకు రీల్ చేస్తూ కనిపించగా.ఆ పాట షన్ను కోసమే అని కొందరు కామెంట్లు పెట్టగా.

ఒక నెటిజన్ మాత్రం.తనకు కలలో వీరిద్దరూ కలిసిపోయారు అని కల వచ్చింది అంటూ.

కానీ చూసే వరకు అది కల అని తెలిసిందంటూ దీప్తికి షాక్ ఇచ్చాడు.ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube