బాలయ్య గోపీచంద్ మూవీ నుంచి వీడియో లీక్.. ఆ వీడియోలో ఏముందంటే?

బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటనే సంగతి తెలిసిందే.ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించడంతో పాటు బాలయ్య రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 Balakrishna Gopichand Malineni Combo Movie Video Leak Details Here Goes Viral ,b-TeluguStop.com

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియో లీక్ కాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ నుంచి తాజాగా ఫైట్ సీన్ లీక్ అయింది.ఈ సన్నివేశంలో బాలయ్య ఒక రౌడీ చేతిని నరికేయగా మిగతా రౌడీలు కత్తులతో కనిపిస్తారు.బ్లాక్ షర్ట్ లో బాలయ్య లుక్ అదుర్స్ అనేలా ఉందని కొంతమంది నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో బాగుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ లేదు.

Telugu Balakrisha, Mythri Makers, Shruti Haasan, Leak-Movie

సంక్రాంతికే ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నా మైత్రీ బ్యానర్ లోనే తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికే రిలీజ్ కానుండటంతో ఈ సినిమాను ఆ సమయానికి రిలీజ్ చెయ్యలేని పరిస్థితి ఉంది.బాలయ్యకు జోడీగా శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమకు 2.5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.సినిమాసినిమాకు నటుడిగా బాలయ్య రేంజ్ పెరుగుతోంది.

Telugu Balakrisha, Mythri Makers, Shruti Haasan, Leak-Movie

బాలయ్య ఈ సినిమా కోసం 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోగా బాలయ్య కెరీర్ లోనే ఈ సినిమాకు హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈ సినిమాకు తీసుకున్నారు.ఈ మధ్య కాలంలో కథ, కథనం విషయంలో సైతం బాలయ్య తీరు మారిందనే సంగతి తెలిసిందే.స్టార్ డైరెక్టర్లకు ప్రాధాన్యత ఇస్తున్న బాలయ్య స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube