Billa Anushka Shetty : బిల్లా సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను: అనుష్క శెట్టి

తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి గురించి అందరికీ సుపరిచితమే.అనుష్క హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందారు.

 I Faced Many Difficulties During Billa Anushka Shetty Faced Many Difficulties  ,-TeluguStop.com

కెరియర్ మొదట్లోనే అరుంధతి వంటి లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె ఈ సినిమా తనకి ఎప్పటికీ ప్రత్యేకమనీ చెబుతారు.ఇక సినిమాలలో మాత్రమే కాకుండా బయట కూడా అనుష్క ఎంతో మంచి మనసు కలవారు ఇలా ఈమె మంచి మనస్తత్వానికి ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారని చెప్పాలి.

ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.తనకి ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే అరుంధతి వంటి సినిమాలో అవకాశం వచ్చింది.

ఈ సినిమా ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి ఈమెకు బిల్లా వంటి సినిమాలో అవకాశం వచ్చింది.బిల్లా సినిమా కథ విన్నప్పుడు తనకు కథ నచ్చినప్పటికీ ఈ సినిమాలో తాను బికినీ ధరించాల్సి వచ్చిందని అనుష్క వెల్లడించారు.

అరుంధతి సినిమాలో ఎంతో వైవిధ్యంగా నటించిన తనని బికినీలో ప్రేక్షకులు ఆదరిస్తారా అన్న సందేహం కూడా కలిగింది.

Telugu Anushka Shetty, Arundhathi, Billa, Faced, Prabhas, Tollywood-Movie

బిల్లా సినిమా కథ తనకు నచ్చి కథ డిమాండ్ చేయడంతో తప్పనిసరిగా జీవితంలో మొదటిసారి బికినీ వేసుకున్నానని అనుష్క తెలిపారు.ఈ విధంగా ఈ సినిమాలో బికినీ వేసుకున్న సమయంలో తనకు ఎంతో ఇబ్బంది కలిగిందని, ఆ క్షణం తనని చాలా బాధపెట్టాయని తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అనుష్క ఈ విషయాలను వెల్లడించారు.ఇకపోతే బాహుబలి సినిమా తర్వాత అనుష్క తదుపరి తన సినిమాను ప్రకటించలేదు.

అయితే ఈమె యువి క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి అనుష్క లుక్ విడుదల చేయడంతో అభిమానులు అనుష్క లుక్ కి ఫిదా అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube