మిడతల్ని... ఉడతల్ని నేను పట్టించుకోను.. జబర్దస్త్ కమెడియన్స్ పై రోజా కౌంటర్!

ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకి చాలా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.రాజకీయాలలో ఎంతో అనుభవం ఉన్నవారి నుంచి మొదలుకొని చిన్నచిన్న స్కిట్లు చేసుకుంటూ ఇండస్ట్రీలో మనుగడ కోసం తాపత్రయ పడుతున్న జబర్దస్త్ కమెడియన్లు కూడా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటం గమనార్హం.

 Roja , Jabardast Comedians , Ap Politics , Ysrcp ,hyper Aadi, Naga Babu , Get-TeluguStop.com

గత కొద్దిరోజులుగా జబర్దస్త్ కమెడియన్స్ అయినటువంటి గెటప్ శ్రీను హైపర్ ఆది వంటి వారు ఏకంగా ఏపీ మినిస్టర్ రోజాపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఇలా గెటప్ శ్రీను హైపర్ ఆది రోజా గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై తాజాగా రోజా దిమ్మతిరిగే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.

ఈ సందర్భంగా రోజూ మాట్లాడుతుండగా కాంపౌండ్లో 6 మంది హీరోలు ఉన్నారు వారి ప్రాపకం కోసం ఇలా చిన్నచిన్న ఆర్టిస్టులతో జబర్దస్త్ కామెడీ చేయిస్తున్నారని రోజా విమర్శించారు.మెగా హీరోల ప్రాపకం కోసం సినిమాలలో వేషాల కోసం వీళ్లు కూడా తనపై ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రోజా మండిపడ్డారు.

పొలిటికల్ అజ్ఞానులు జోకర్లు తనపై చేసే విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని ఈమె తెలియజేసారు.

క ఏపీ టూరిజం మినిస్టర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ టూరిజం 18వ స్థానంలోకి పడిపోయిందని నాగబాబు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఈమె కౌంటర్ వేశారు.శ్రీకాకుళం సభలో భాగంగా హైపర్ ఆది మంత్రి రోజా గురించి మాట్లాడుతూ మంత్రులకు శాఖల గురించి తెలియదంటూ ఈయన సెటైర్లు వేశారు.

హైపర్ ఆదినీ రోజా టార్గెట్ చేస్తూ ఇలా మిడతలు ఉడతలు గురించి తాను ఏమాత్రం పట్టించుకోనని ఈ సందర్భంగా రోజా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.మొత్తానికి రోజా నవ్వుతూనే తనను విమర్శించిన వారికి పవర్ ఫుల్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube