మమతా మోహన్ దాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.తెలుగులో కూడా ఈమె చింతకాయల రవి, యమదొంగ, వంటి పలు సినిమాలలో నటించి ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు.
నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే అతి భయంకరమైన క్యాన్సర్ మహమ్మారి బారిన పడిన మమతా మోహన్ దాస్ ఎంతో ధైర్యంగా క్యాన్సర్ ను ఎదుర్కొని నిలబడ్డారు.ఒకసారి కాకుండా రెండుసార్లు ఈమె క్యాన్సర్ బారిన పడి కఠినమైన వ్యాయామాలు ఆహార నియమాలను పాటిస్తూ ఎంతో ధైర్యంగా ఈ భయంకరమైన వ్యాధి నుంచి బయటపడ్డారు.
ఇలా క్యాన్సర్ నుంచి బయటపడిన వెంటనే మరొక వ్యాధి ఈమెను మరింతగా కృంగదీసింది.

క్యాన్సర్ నుంచి బయటపడ్డాను అని సంతోషించేలోపే ఈమె ఆటో ఇమ్యూన్ కి గురయ్యారు.అది బొల్లి వ్యాధికి దారి తీసింది.సాధారణంగా హీరోయిన్స్ అందానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు అలాంటి హీరోయిన్లు ఈ విధంగా బొల్లి వ్యాధి బారిన పడితే వారి బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అయితే ఈ వ్యాధి సోకిందని తెలియగానే తాను పడిన మానసిక క్షోభ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మమతా మోహన్ దాస్ బయటపెట్టారు.

ఈ సందర్భంగా మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ.మహేష్ మారుతియం షూటింగ్ టైం లో ఒంటి పై మచ్చలు గమనించాను.అవి ముఖం, చేతులు, మెడపై వ్యాపించాయి.దాంతో ఒక్కసారిగా తాను ఆందోళన వ్యక్తం చేస్తూ పరీక్షలు చేయించుకున్నానని తెలిపారు అయితే ఆ పరీక్షలలో అది బొల్లి వ్యాధి అని తెలియగానే ఒక్కసారిగా ఒంటరిని అయ్యాను అనే ఫీలింగ్ తనకు కలిగిందని తెలిపారు క్యాన్సర్ సోకినప్పుడు తన ఫ్రెండ్స్ కి చెప్పుకోగా వాళ్ళందరూ తనకు మద్దతు తెలిపారు.
కానీ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక నెలలు తరబడి ఒక్కదాన్నే ఇంట్లో కూర్చుని ఏడ్చానని తన మానసిక వేదనను బయటపెట్టారు.ఈ వ్యాధికి మెడిసిన్ వాడుతుంటే ఊపిరితిత్తుల సమస్య వచ్చిందని దాంతో మెడిసిన్స్ కూడా ఆపేశానని తెలిపారు.
ఒంటరిగా ఉండలేక చనిపోతానేమో అనే భయం తనకు కలిగి ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పడంతో అప్పుడు తనకు ఉపశమనం కలిగింది అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.