కన్నడ స్టార్ హీరోగా, కేజిఎఫ్ చిత్రం ద్వారా పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు పాన్ ఇండియా స్థాయి హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరీర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా హీరో యష్ మాట్లాడుతూ తన తండ్రి ఒక సాధారణ ఆర్టీసీ డ్రైవర్ అని, తన తల్లి గృహిణి అని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం తాను ఇలాంటి స్టార్ డమ్ అనుభవిస్తున్నప్పటికీ గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడించారు.
కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన యశ్ కి నటనపై ఆసక్తి ఉండడంతో చదువు పూర్తి కాగానే తనకు ఇండస్ట్రీలోకి వెళ్లాలని ఉందనే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు వెల్లడించారు.అయితే ఇండస్ట్రీలోకి వెళ్లడానికి తన కుటుంబ సభ్యులు ఏ మాత్రం ఒప్పుకోలేదు.

ఇక తనకు నటనపై ఎంతో ఆసక్తి ఉండటంతో నిర్ణీత సమయంలో ఇండస్ట్రీలో అవకాశాలను అందుకోకపోతే తాము చెప్పిన వృత్తిలో స్థిరపడాలని తన తల్లిదండ్రులు కండిషన్ పెట్టినట్లు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.అలా తన తండ్రి అంగీకారంతో 300 రూపాయలు చేతిలో పెట్టుకొని బెంగళూరుకు వచ్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశానని యశ్ వెల్లడించారు.ఇలా అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో సీరియల్ ఆర్టిస్ట్ గా అవకాశాలు దక్కించుకుని పలు సీరియల్స్ లో నటించారు.అనంతరం రాకీ సినిమాలో హీరోగా అవకాశం దక్కించుకొని హీరోగా పరిచయమైన అనంతరం కేజీఎఫ్ చిత్రం ద్వారా పాన్ ఇండియా హీరోగా ఎంతో క్రేజ్ ఏర్పరుచుకున్నారు.