మనసు మార్చుకున్న నాని ! ఏ పార్టీ నుంచి పోటీ అంటే..? 

చాలాకాలం టిడిపి( TDP )లోనే ఉంటూ ఆ పార్టీ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా, పార్టీలోని నాయకుల పైన విమర్శలు చేస్తూ సంచలనంగా మారిన విజయవాడ టిడిపి ఎంపీ కేసినేని నాని( Kesineni nani ) ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారారు.

నాని వ్యవహారం ఈ విధంగా ఉండడంతోనే వచ్చే ఎన్నికల్లో నాని సోదరుడు చిన్నిని టిడిపి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించేందుకు టిడిపి అధిష్టానం నిర్ణయించుకుంది .

ఈ మేరకు చిన్ని విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ,  పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు .యువ గళం పాదయాత్రలోనూ చురుగ్గా పాల్గొన్నారు.దీంతో నాని బిజెపి లేదా వైసీపీలో చేరుతారని , అందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు అందరిలోనూ కలిగాయి.

అయితే అనూహ్యంగా నాని పార్టీ మార్పు వ్యవహారంపై స్పందించారు.

అలాగే అధినేత చంద్రబాబు పైన ప్రశంసలు కురిపించారు.దేశ రాజకీయాల్లో చంద్రబాబు ( N Chandrababu Naidu )చాలా నిజాయితీగల వ్యక్తి అని,  చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అవినీతి  మచ్చలేని నాయకుడిగా నిలిచారని నాని అన్నారు.చంద్రబాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులను తప్పు పట్టారు .నోటీసులు పెద్ద విషయం కాదని , దానికి చంద్రబాబు వివరణ ఇస్తారని నాని అన్నారు.అలాగే టిడిపి 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో క్రింది స్థాయి నాయకులను ఇప్పటికీ కూడా చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లకపోవడం దురదృష్టకరమంటూ నాని వ్యాఖ్యానించారు .

Advertisement

వారిని రాజకీయంగా ఎదగకుండా ఆ ప్రాంత నాయకులు వాడుకుని వదిలేశారని ఆరోపించారు.ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో  ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారనే విషయం పైన స్పందించిన నాని , తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని,  వచ్చే ఎన్నికల్లో విజయవాడ అభ్యర్థిగానే పోటీ చేస్తానని నాని క్లారిటీ ఇచ్చారు.దీంతో  నాని టిడిపిని వీడే ఆలోచనను విరమించుకున్నారనే విషయం అర్థమవుతోంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు