మనసు మార్చుకున్న నాని ! ఏ పార్టీ నుంచి పోటీ అంటే..?
TeluguStop.com
చాలాకాలం టిడిపి( TDP )లోనే ఉంటూ ఆ పార్టీ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా, పార్టీలోని నాయకుల పైన విమర్శలు చేస్తూ సంచలనంగా మారిన విజయవాడ టిడిపి ఎంపీ కేసినేని నాని( Kesineni Nani ) ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారారు.
నాని వ్యవహారం ఈ విధంగా ఉండడంతోనే వచ్చే ఎన్నికల్లో నాని సోదరుడు చిన్నిని టిడిపి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించేందుకు టిడిపి అధిష్టానం నిర్ణయించుకుంది .
ఈ మేరకు చిన్ని విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు .
యువ గళం పాదయాత్రలోనూ చురుగ్గా పాల్గొన్నారు.దీంతో నాని బిజెపి లేదా వైసీపీలో చేరుతారని , అందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు అందరిలోనూ కలిగాయి.
అయితే అనూహ్యంగా నాని పార్టీ మార్పు వ్యవహారంపై స్పందించారు. """/" /
అలాగే అధినేత చంద్రబాబు పైన ప్రశంసలు కురిపించారు.
దేశ రాజకీయాల్లో చంద్రబాబు ( N Chandrababu Naidu )చాలా నిజాయితీగల వ్యక్తి అని, చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చలేని నాయకుడిగా నిలిచారని నాని అన్నారు.
చంద్రబాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులను తప్పు పట్టారు .నోటీసులు పెద్ద విషయం కాదని , దానికి చంద్రబాబు వివరణ ఇస్తారని నాని అన్నారు.
అలాగే టిడిపి 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో క్రింది స్థాయి నాయకులను ఇప్పటికీ కూడా చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లకపోవడం దురదృష్టకరమంటూ నాని వ్యాఖ్యానించారు .
"""/" /
వారిని రాజకీయంగా ఎదగకుండా ఆ ప్రాంత నాయకులు వాడుకుని వదిలేశారని ఆరోపించారు.
ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారనే విషయం పైన స్పందించిన నాని , తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో విజయవాడ అభ్యర్థిగానే పోటీ చేస్తానని నాని క్లారిటీ ఇచ్చారు.
దీంతో నాని టిడిపిని వీడే ఆలోచనను విరమించుకున్నారనే విషయం అర్థమవుతోంది.
.
తీరు మార్చుకున్న కీర్తి సురేష్ .. ఇక ఆ మహానటి కనిపించే అవకాశం లేదు