నేను పులి.. మా డాడ్ నన్ను అలా పెంచారు.. బ్రేకప్ తర్వాత దీప్తి సునైనా ఇలా?

బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరై ఎంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న దీప్తి సునైనా గురించి అందరికీ తెలిసిందే.హౌస్ లో ఉన్నంత కాలం బాగా అల్లరి చేస్తూ, ఎమోషనల్ గా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

 I Am A Tiger My Dad Treate Me Like That Deepti Sunaina After Breakup, Deepthi Su-TeluguStop.com

బిగ్ బాస్ షో కంటే ముందు డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఆ తర్వాత యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో బాగా మెప్పించింది.

అలా బిగ్ బాస్ లో అవకాశం అందుకోగా తన కెరీర్ మొత్తం బిగ్ బాస్ తో మొదలైందని చెప్పవచ్చు.ఇక బిగ్ బాస్ తర్వాత పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.

మంచి సక్సెస్ లు అందుకుంది.మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అంతేకాకుండా సింగర్ గా కూడా బాగా మెప్పించింది.ఇక దీప్తి సునైనా మరో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా చేసింది.

ఇక వీరిద్దరూ కలిసి కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేశారు.దీంతో వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఏర్పడింది.కొంతకాలం వరకు వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ లా ఉన్నట్లు అందరినీ నమ్మించారు.కానీ కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుందని అనుమానాలు వచ్చాయి.

అంతేకాకుండా టాటూలు కూడా ఒకేలా వేయించుకోవటంతో బాగా అనుమానాలు రావడంతో ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 5 తో నిజమైంది.

పలు బుల్లితెర షో లలో కూడా వీరిద్దరు జంటగా పాల్గొని బాగా రచ్చరచ్చ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇటీవలే ముగిసిన సీజన్ 5 లో షణ్ముఖ్ పాల్గొని రన్నరప్ గా నిలిచాడు.ఈ సీజన్ ప్రారంభంలో షన్ను బాగా సైలెంట్ గా డీల్ చేసాడు.

ఆ తర్వాత మరో కంటెస్టెంట్ సిరి అతడి లైఫ్ లోకి ఎంట్రీ ఇవ్వటంతో షన్ను లైఫ్ మొత్తం మారిపోయింది.

మొత్తానికి నెగిటివిటిని మూటగట్టుకున్నాడు.

ఆల్రెడీ దీప్తి తో లవ్ లో ఉన్నాడు.ఓసారి దీప్తి కూడా అదే వేదికపై షణ్ముఖ్ కు లవ్ ప్రపోజల్ కూడా చేసింది.

దీంతో వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుంది అని అందరికీ క్లారిటీ వచ్చింది.అయినా కూడా షన్ను సిరితో మితిమీరి హద్దులతో ప్రవర్తించడంతో బాగా విమర్శలు ఎదుర్కొన్నాడు.

అంతేకాకుండా షో నుండి బయటికి వచ్చాక దీప్తి సునైనా ను దూరంగా ఉంచటంతో.దీప్తి అస్సలు నిర్ణయాన్ని తీసుకుంది.ఇక షన్ను తో తన రిలేషన్ కరెక్ట్ కాదని బ్రేకప్ చెప్పుకుంది.ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.ఇక ఆరోజు నుంచి దీప్తి బాగా ఎమోషనల్ గా ఉంటుంది.

సోషల్ మీడియా వేదికగానే తాను రిఫ్రెష్ అవుతుంది.

తాజాగా తన సోషల్ మీడియా వేదికగా పలు వీడియోలు పంచుకుంది.అందులో.

చిరుత సినిమాలో.నేను పులి.

మా డాడ్ నన్ను అలా పెంచారు అనే డైలాగ్ తో వీడియో చేసింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు దీప్తి కి ధైర్యం ఇస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube