మరోసారి బాలయ్య బాబుని గెలికిన హైపర్ ఆది...

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీ లో ప్రతి గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంతగా పాపులర్ అయ్యిందో పెద్దగా చెప్పనవసరం లేదు.

అయితే ఈ కామెడీ షో లో తనదైన శైలిలో పంచులతో ఆకట్టుకునే హైపర్ ఆది గురించి అయితే తెలియనివారుండరు.

కాగా లాక్ డౌన్ కారణంగా చాలా కాలం తర్వాత షూటింగులు మళ్ళీ ప్రారంభం కావడంతో తాజాగా షో నిర్వాహకులు 25వ తారీఖున ప్రసారమయ్యేటువంటి ఎపిసోడ్ ప్రోమోని ఇటీవలే యూట్యూబ్లో విడుదల చేశారు.అయితే  ఇందులో హైపర్ ఆది నందమూరి నటసింహం బాలయ్య బాబు, బోయపాటి శీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న టువంటి చిత్రానికి సంబంధించిన ఓ డైలాగ్ ని ఇటీవలే బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయగా ఆ డైలాగ్ ని కాపీ కొడుతూ చెప్పినటువంటి డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

ఇందులో రైజింగ్ రాజు ఆది గారికి మా జంటను చూస్తే కుళ్ళు లా ఉంది అంటూ ఆది పై సెటైర్ వేస్తాడు.దీంతో హైపర్ ఆది ఎదుటివారితో ఎలా మాట్లాడాలో నేర్చుకో అంటూ చెప్పేటువంటి డైలాగ్ కి రెస్పాన్స్ అదిరిపోయింది.

దీంతో కొందరు నెటిజన్లు హైపర్ ఆది చెప్పినటువంటి ఈ డైలాగ్ ని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.అయితే దీనికి తోడు బాలయ్య బాబు చెప్పినటువంటి ఈ డైలాగ్ అప్పట్లో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి అన్నట్లుగా నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాలలో ట్రేండింగ్  చేశారు.

Advertisement

అయితే ఈ ప్రోమోని విడుదల చేసిన అతి తక్కువ కాలంలోనే 36 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి.దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు జబర్దస్త్ కి  యూట్యూబ్ లో ఎంత మంచి క్రేజ్ ఉందని.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు