అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన.ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా నవరాత్రులు స్పెషల్ ఎపిసోడ్ ప్రసారమైంది.
ఈ క్రమంలోనే వేదికపైకి పలువురు సినీ తారలు కమెడియన్స్ సింగర్స్ వచ్చి తనదైన శైలిలో హౌస్ సభ్యులను ప్రేక్షకులను సందడి చేశారు.ఈ క్రమంలోనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో వేదికపైకి వచ్చిన హైపర్ ఆది తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ప్రేక్షకులను నవ్వించారు.
ఈ క్రమంలోనే స్టేజ్ పైకి రాగానే హైపర్ ఆది నాగార్జున నటించిన సినిమా గురించి సెటైర్లు వేశారు.1989 అక్టోబర్ 5న మీరు అమ్మాయి మెడలో చైన్ లాగి నందుకు మీపై కంప్లైంట్ వచ్చింది.అనగా నేను లాగింది అమ్మాయి మెడలో చైన్ కాదు సైకిల్ చైన్ అంటూ శివ సినిమా గురించి గుర్తు చేసుకుంటారు.ఈ క్రమంలోనే మీరు సైకిల్ చైన్ లాగా రా నేను అమ్మాయి మెడలో చైన్ లాగారేమో అనుకున్నాను అంటూ సెటైర్ వేస్తారు.
ఈ క్రమంలోనే హైపర్ ఆది మాట్లాడుతూ నేను కూడా ఒకరోజు సైకిల్ చైన్ లాగాలని ప్రయత్నించాను.అయితే సైకిల్ చైన్ రాకపోగా చేతిలో తోలు ఊసి పోయిందని హైపర్ ఆది చెప్పడంతో నాగార్జున తన పై మరోసారి కౌంటర్ వేశారు.
ఇంకోసారి అలా లాగితే చేతి పై ఉన్న తోలు కాదు ఒంటిపై ఉన్న తోలు ఊడుతుంది అంటూ నాగార్జున హైపర్ ఆది పై సెటైర్ వేశారు.ఇలా బిగ్ బాస్ వేదికపై హైపర్ ఆది తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరిని సందడి చేశారు.







