ఏపీ రాజధానిపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి( YV Subbareddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.విశాఖ రాజధానిగా సిద్ధం అయ్యేంత వరకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం తాత్కాలిక రాజధానిని నిర్మించిందని తెలిపిన ఆయన రాజధానిని నిర్మించే స్థోమత ప్రస్తుతం ఏపీకి లేదని తెలిపారు.అయితే విశాఖ( Visakhapatnam )ను పరిపాలన రాజధాని అనుకున్నామని, దానిపై న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే న్యాయపరమైన చిక్కులు ఎప్పుడు వీడతాయో తెలియదని చెప్పారు.ఈ నేపథ్యంలో మరి కొన్నాళ్లు హైదరాబాద్( Hyderabad ) ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని తెలిపారు.