రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 185 వద్ద ఉన్న వాటర్ పైపులైన్ వాల్ ను ఢీకొన్న ఓ కార్

రంగా రెడ్డి:- రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 185 వద్ద ఉన్న వాటర్ పైపులైన్ వాల్ ను ఢీకొన్న ఓ కార్.మెహదీపట్నం నుండి ఆరాంఘర్ వైపు వెళ్తున్న ఓ కార్ మధ్యరాత్రి 3 గంటల సమయంలో రోడ్డు పై ఉన్న ఓ వాటర్ పైప్ లైన్ వాల్ ను ఢీ కొనడంతో, నీటి వాల్ పగిలి ఒకేసారి రోడ్డు పై భారీ ఎత్తున నీళ్లు రావడం జరిగింది.

 Hyderabad Rajendranagar Heavy Water Line Break In Car Accident Details, Hyderaba-TeluguStop.com

దీనితో వేల లీటర్ల నీళ్లు వృధా అయి, రోడ్డు మొత్తం జలమయం అయింది.కార్ లోపల ఉన్న వ్యక్తి కు స్వల్ప గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.సంఘటన స్థలానికి చేరుకున్న వాటర్ వర్క్స్ సిబ్బంది, మెహదీపట్నం నుండి ఆరాంఘర్ వైపు వెళ్తున్న పైప్ లైన్ వాల్ ను మరమ్మతు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube