హైదరాబాదులో ఇటీవల రాడిసన్ పబ్ లో పట్టుబడ్డ సెలబ్రిటీలు అంతా కూడా ఇప్పుడు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి పోయారు.చాలా మంది మీడియా ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఇద్దరు ముగ్గురు మాత్రం మీడియా ముందుకు వచ్చి తమకే పాపం తెలియదు మీడియాలో అనవసరంగా తన గురించి తప్పుడు వార్తలు చేయవద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.తమకు ఫ్యామిలీ లు ఉన్నాయి.
ఆ ఫ్యామిలీ లకు మనోభావాలు ఉంటాయి.తమ గురించి ఇష్టానుసారంగా ఇలా కథనాలు రాయడం ద్వారా తాము మరియు తమ ఫ్యామిలీ లు ఇబ్బంది పడాల్సి ఉంటుంది అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా మీడియాకు సున్నితంగా కౌంటర్ ఇస్తున్నారు.
ఇక మరి కొందరు బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి లేదా సోషల్ మీడియా ద్వారా తమ వారికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని కేవలం పార్టీకి వెళ్లిన కారనంగా కారణంగా తీసుకు వెళ్లారని చెపుతున్నారు.
ఆ పబ్బుకి తెల్లవార్లు నడిపించే పర్మిషన్ ఉండి ఉంటుంది అనే ఉద్దేశంతో తాము అర్థ రాత్రి దాటిన తర్వాత కూడా ఉన్నామని అంతేకాని డ్రగ్స్ తీసుకోవడానికి కానీ లేదా మరి దేనికైనా కానీ అక్కడ లేవంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళ లేదని కేవలం.సరదాగా వెళ్లామని చెబుతున్నారు.

ఒక సోషల్ మీడియా సెలబ్రెటీ మాట్లాడుతూ సమోసాలు బాగుంటాయని తినడానికి వెళ్ళాము తప్ప అక్కడ ప్రత్యేకంగా డ్రగ్స్ ఉంటాయని మాకు తెలియదని, ఎవరు తీసుకుంటారు మాకు తెలియదా అంటూ తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఈ వ్యవహారం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం లో వారి పరువు బజారు అయింది.అందుకే వారు ఇప్పుడు నష్టనివారణ చర్యల్లో భాగంగా తమకు ఏ పాపం తెలియదు అంటూ మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు.కానీ ఇప్పటికే జరిగి పోవాలి నష్టం జరిగిపోయింది.







