SBI పేరుతో ఇలాంటి మోసం జరుగుతోంది ... జాగ్రత్త అంటున్న పోలీస్

ప్రియమైన వినియోగదారులారా, మేము మా బ్యాంకింగ్ ఐటి సిస్టమ్ ని మరింత డెవలప్ చేసేందుకు, మీకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నాం.

ఈ కార్యక్రమంలో భాగంగానే, మా బ్యాంకింగ్ సిస్టమ్ ని అప్ గ్రేడ్ చేస్తున్నాం.

మిమ్మల్ని కోరేది ఏమింటంటే, మీ బ్యాంక్ వివరాలు ఈ లింక్ (link) లో తెలిపి, మాతో సహకరించగలరు.
ఈ లింక్ (మరో link) ని మీ వైట్ లిస్ట్ లేదా సేఫ్ సెండర్ లిస్టులో పెట్టుకోవాల్సిందిగా మనవి.

లేని యెడల మీ ISP (Internet Service Provider) బ్యాంకు నుంచి వచ్చే అప్డేట్స్ ని నిలిపివేస్తుంది
ధన్యవాదములు - State Bank Of India
SBI అఫీషియల్ లోగోతో SBI ఖాతాదారులకి వస్తున్న ఒక ఈమేయిల్ కి అనువాదం ఇది.ఈ మెయిల్ ని అమాయకులు చూస్తే, ఈమధ్యే SBI తన SBH తో కలిపి సహబ్యాంకులన్నటినీ మెర్జ్ (విలీనం) చేసుకుంది కదా, రికార్డులు గజీబిజీ అయి ఉంటాయి, అందుకేనేమో బ్యాంకు వివరాలు మళ్ళీ అడుగుతున్నారు అనుకోని, తమ బ్యాంకు వివరాలు ఆ లింక్ లో పెట్టినా పెట్టేస్తారు.ఎందుకంటే ఆ మెయిల్ నిజంగానే అదంతా నిజమని నమ్మించేలా ఉంది.

అచ్చం SBI నుంచే వచ్చినట్టుగా, అదే లోగోతో ఉంది.కాని ఇదంతా ఓ మాస్టర్ ప్లాన్, ఫేక్ మేయిల్.

Advertisement


ఈ మేయిల్ హ్యాకర్లు సృష్టించింది, SBI కి కొత్తగా మీ బ్యాంకు వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, దీన్ని నమ్మకండి, మీ మిత్రులకి కూడా ఈ సమాచారాన్ని ఇవ్వండి అంటూ ఈ నకిలీ మెయిల్స్ గురించి ఈరోజు హెచ్చరించారు హైదరాబాద్ నగర అడీషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్వాతి లాక్ర, IPS.
వివరాల్లోకి వెళితే, ఇదొక ఫిషింగ్ లింక్.హ్యాకింగ్ పద్ధతుల్లో ఇది కూడా ఒకటి.

SBI లో వచ్చిన మార్పులకి, మీ బ్యాంకు వివరాలకి ఎటువంటి సంబంధం లేదు.పొరపాటులో అది నిజమైన SBI నుంచి వచ్చిన మేయిల్ అనకోని మీ బ్యాంకు వివరాలు ఇచ్చారో, ఉన్నదంతా ఊడ్చుకుపోతారు హ్యాకర్లు.

తస్మాత్ జాగ్రత్త.ఈ విషయాన్ని మీరు చదవడమే కాదు, మీ స్నేహితులకి కూడా షేర్ చేయండి.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు