క్షణ క్షణం ఉత్కంఠగా మారుతున్న హుజురాబాద్ రాజకీయాలు...

తెలంగాణలో మరో ఉప ఎన్నిక కు సమయం ఆసన్నమవుతుందన్న విషయం తెలిసిందే.అదే హుజూరాబాద్ ఉప ఎన్నిక.

భూ కబ్జా ఆరోపణలపై మంత్రి పదవి నుండి కేసీఆర్ భర్తీ చేసిన విషయం తెలిసిందే.అయితే అయితే ఇప్పుడు హుజురాబాద్ లో ఆకస్మికంగా రాజకీయాలు మారుతున్న పరిస్థితి ఉంది.

అయితే ఈటెల రాజేందర్ తరువాత అక్కడ బలంగా ఉన్న నేత పాడి కౌశిక్ రెడ్డి గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితి ఉంది.అయితే అక్కడ కాంగ్రెస్ బలంగా ఉన్నా రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ పోటీ చేసినా గెలవదు అని పీసీసీ చీఫ్ అయిన రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం ఇప్పుడు పెద్ద సంచలన విషయంగా మారింది.

అయితే దుబ్బాక ఉప ఎన్నిక ఎంతగా హాట్ టాపిక్ గా మారిందో అంతకు మించి ఉత్కంఠను హుజూరాబాద్ ఎన్నికలు తలపిస్తున్నాయని చెప్పవచ్చు.ఈటెలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే ఈటెల కు రాజకీయంగా చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున తెర వెనుక కసరత్తు చేసే అవకాశం ఉంది.

Advertisement

అయితే అక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా బీజేపీ వైపు మళ్లే అవకాశం ఉండడంతో టీఆర్ఎస్ కొంత శ్రమించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు