ఇటీవలే తరచూ వింటున్న దారుణాలలో అక్రమ సంబంధానికి సంబంధించిన దారుణాలే చాలా అధికంగా ఉన్నాయి.కాసేపటి శారీరక సుఖం కోసం ఏర్పడిన అక్రమ సంబంధాలు( Extramarital Affairs ) చివరకు కుటుంబాలలో తీవ్రను విషాదాలను మిగిల్చి కుటుంబాలనే రోడ్డున పడేస్తున్నాయి.
ఇలాంటి కోవలోనే ఓ భార్య అక్రమ సంబంధం బయటపడడంతో ఆమె మెడకు చున్ని బిగించి భర్త హత్య చేశాడు.ఈ ఘటన మంగళవారం అనకాపల్లిలోని తోటాడ లో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

తోటాడ గ్రామంలోని దళితవాడలో కొత్తలంక నూక అప్పారావు సీలింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.ఇతనికి గొలుగొండ మండలం గుండపాలకు చెందిన దీనమ్మ (28)తో పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.వీరికి ముగ్గురు పిల్లలు సంతానం.
పిల్లలు స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు.
కొంత కాలం వరకు వీరి సంసారం సంతోషంగానే సాగింది కానీ దీనమ్మ పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఆ విషయం భర్తకు తెలియడంతో తరచూ గొడవ పడేవాడు.భార్య ప్రవర్తనలో మార్పు కోసం కొంతకాలం ఇతర ప్రాంతాలలో వేరే కాపురం కూడా పెట్టారు.
కానీ దీనమ్మలో మార్పు రాలేదు.ఈ విషయంపై ప్రతిరోజూ గొడవలు జరుగుతూ ఉండడంతో ఈ నెల 23న గ్రామ పెద్దల ముందు పంచాయతీ పెట్టారు.
మంగళవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో పిల్లలు బడికి వెళ్లిపోయాక మళ్లీ భార్యాభర్తల మధ్య ఘర్షణ మొదలైంది.

క్షణికావేశంలో ఉన్న భర్త, దీనమ్మ మెడకు చున్ని బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య( Murder ) చేశాడు.ఆమె చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత తానే స్వయంగా అనకాపల్లి దిశా పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయం చెప్పి లొంగిపోయాడు.పోలీసులు ఇంటికి వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఉదయం సంతోషంగా స్కూలుకు వెళ్లిన పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చాక జరిగి ఘోరాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు.







