సుమ, రాజీవ్ కనకాల దంపతులు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా బుల్లితెరపై కూడా ఎంతో మందికి సుపరిచితమే. దేవదాస్ కనకాల( Devadas Kanakala ) వారసుడిగా రాజీవ్ కనకాల బుల్లితెర నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.
అంతకు ముందే మలయాళ కుటుంబం లో జన్మించిన సుమ సైతం సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది.వీరిద్దరూ ఒక సీరియల్ లో కలిసిన నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు.
మొదట ఈ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోయినా అందర్నీ ఒప్పించి ఎట్టకేలకు వీరు పెళ్లి చేసుకున్నారు.ఇక ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అయితే రాజీవ్ కనకాల( Rajeev Kanakala ), సుమ విడాకులు తీసుకుంటారు అనే వార్త ఎల్లప్పుడు మీడియాలో కనిపిస్తూ ఉంటుంది.

సుమ( Suma Kanakala ) తన కెరియర్ లో ఎంతో ఎత్తుకు వెళ్ళిపోగా రాజీవ్ కాస్త నెమ్మదిగా కొనసాగిస్తున్నాడు.ఇక రాజీవ్ కనకాల ఈ విషయంపై ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చాడు.తమ కెరియర్ల గురించి అలాగే విడాకుల గురించి పదేపదే మాట్లాడటం మీడియా వారికి అలవాటుగా మారిపోయింది అంటూ సోషల్ మీడియా( Social Media )కి చురకలు అంటించాడు.
సుమా ఎంతగానో కష్టపడి పనిచేస్తుందని ఆమెకు కెరియర్ తో పాటు కుటుంబం కూడా ఎంతో ముఖ్యంగా భావిస్తూ ఉంటుందని ఎక్కడ ఉన్నా తన పిల్లల బాగోగులు మాత్రం ఆమె చూసుకుంటూ ఉంటుందని చెప్పాడు రాజీవ్.అందరి కుటుంబాల లాగానే మా కుటుంబం కూడా ఉంటుందని మేము ఎప్పుడూ గొడవలు పడతామని మీరు వినేది ఆ వాస్తవం అని ప్రతి భార్యాభర్తకు వచ్చే సమస్యలే మాకు వస్తాయని రాజీవ్ చెప్పుకొచ్చాడు.

ఇక ఎన్ని సమస్యలు వచ్చినా మేము పెద్దగా పట్టించుకోము అని కానీ సుమ తల్లి( Suma Mother ) మరియు మా తల్లిదండ్రులు, మేము అందరం ఒకే అపార్ట్మెంట్ లో వేరు వేరు ఫ్లాట్స్ లో ఉండేవాళ్ళం అని మా అమ్మ బ్రతికి ఉన్నప్పుడు సుమ తల్లితో కలిసి ఇమడలేక పోయిందని, చిటికిమాటికి ఇద్దరు ఒకరిపై ఒకరు కంప్లైంట్స్ చేసుకునేవారని, కానీ అవి మేము పెద్దగా పట్టించుకోమని అవి ఎక్కువగా పిల్లల విషయంలోనే వచ్చేవని కూడా రాజీవ్ స్పష్టం చేశాడు.అమ్మ పోయాక ఆ ప్రస్తుతం ఆ విషయాలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని ప్రతి భార్య భర్త ఎలా ఉంటారో మేము కూడా అలాగే ఉంటామని చెప్పుకచ్చాడు.







