భార్యను కాలువలో తోసి చంపి ప్రమాదంగా కథ అల్లిన భర్త...!

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలంలో ప్రమాదవశాత్తు సాగర్ ఎడమ కాలువలో యువతి గల్లంతు ఘటనలోని ట్విస్ట్ ను పోలీసులు చాకచక్యంగా చేధించారు.

బుధవారం మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామ శివారులో శనివారం రాత్రి బైకు అదుపుతప్పి సాగర్ ఎడమ కాలువలో పడగా అంగనవాడి టీచర్ గల్లంతు కాగా భర్త ప్రాణాప్రాయస్థితిలో బయటపడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.ఈ కేసుపై దర్యాప్తును మిర్యాలగూడ రూరల్ సిఐ విరబాబు నేతృత్వంలో వేములపల్లి ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు కొనసాగించారు.దీనితో ఈ కేసులో అసలు ట్విస్ట్ బయటికి వచ్చింది.

భార్యను భర్త కావాలని కాలువలోకి నెట్టి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.కామేపల్లి గ్రామానికి చెందిన అంగనవాడి టీచర్ ఇటీవల పదోన్నతిపై వెళ్లిపోగా ఆమనగల్లు గ్రామపంచాయతీ పరిధిలోని రావువారిగూడెంకు చెందిన అంగన్వాడీ టీచర్ పేరబోయిన అనుష (35) కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.

అనూషకు భర్త సైదులుకు మధ్య గత కొంత కాలంగా కుటుంబ వివాదాలు ఏర్పడ్డాయి.దీనితో శనివారం ఉదయం తన భర్త సైదులతో కలిసి ద్విచక్ర వాహనంపై అనుష కామేపల్లి గ్రామానికి విధులపై బయలుదేరి వెళ్ళింది.

Advertisement

సాయంత్రం తన భర్తతో పాటు ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో రావులపెంట గ్రామశివారులోని బ్రిడ్జి వద్ద బైక్ కాల్వలో దూకించిన భర్త ఈదుకుంటూ బయటకు వచ్చాడు.అనూష మాత్రం బైక్ తో సహా కాలువలో గల్లంతైంది.

ప్రాణాలతో బయటపడ్డ భర్త సైదులు పోలీసులకు, మీడియాకు బైక్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిందని, తన భార్య,బైక్ కొట్టుకు పోయాయని,ప్రమాదవశాత్తు బైక్ తో సహా కాల్వలో పడ్డట్టు సీన్ క్రియేట్ చేసి కట్టుకథ వినిపించాడు.ఈ విషయమై సంఘటన జరిగిన తీరు గురించి పోలీసులు అడుగిన వాటికి పొంతనలేని సమాధానాలు చెప్పిన భర్త సైదులు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు.ఇది ప్రమాదం కాదు,హత్య అని పోలీసులు తేల్చేశారు.

నిందితుడు సైదులును అరెస్ట్ చేసి ఒక బైకు,రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.అనూషకు కూతురు రాజకుమారి, కుమారుడు స్వర్ణరాజ్ ఉన్నారు.

ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి త్వరగా ఛేదించిన సీఐ,ఎస్ఐ, సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.

వాడపల్లి వద్ద రోడ్డు ప్రమాదం మహిళ మృతి
Advertisement

Latest Nalgonda News