హీరోయిన్ అనిత( Heroine Anitha ) అనే పేరు కంటే నువ్వు నేను హీరోయిన్ అంటే తెలుగు ప్రేక్షకులు వెంటనే గుర్తుపడతారని చెప్పాలి.ఎందుకంటే ఒకప్పుడు లవ్ సినిమాలలో తను చేసిన పర్ఫామెన్స్ అంతా ఇంత కాదు కాబట్టి.
అనిత తొలిసారిగా 2001 తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమా( Nuvvu Nenu )తో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఈ సినిమాలో తన నటనకు మంచి పేరు సంపాదించుకుంది.
అంతేకాకుండా కుర్రాళ్లను అభిమానులుగా మార్చుకుంది.
ఆ తర్వాత శ్రీరామ్, నిన్నే ఇష్టపడ్డాను, నేను పెళ్ళికి రెడీ, తొట్టి గ్యాంగ్ సినిమాలలో చేసిన తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయింది.అలా 2003లో కుచ్ తో హై అనే సినిమాతో పరిచయమైంది.ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో తనకు మంచి అవకాశాలు వచ్చాయి.
ఇక సీరియల్ లో నెగటివ్ రోల్ లో కూడా చేసింది.ఈమెకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి అభిమానం ఉంది.
ఒక మంచి హోదాలో ఉన్న సమయంలో ఆమె 2013లో ప్రముఖ వ్యాపారవేత రోహిత్ రెడ్డి( Rohith Reddy )ని గోవాలో పెళ్లి చేసుకుంది.వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఈ వయసులో కూడా తను మంచి ఫిజిక్ తో ఉంది.బాగా వర్క్ అవుట్ లు చేస్తూ కష్టపడుతూ కనిపిస్తుంది.సోషల్ మీడియా( Social Media )లో నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.
తన భర్తతో ఫన్నీ ఫన్నీ వీడియోస్( Actress Anitha Funny Videos ) చేస్తూ తన ఫాలోవర్స్ కు పంచుకుంటుంది.అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది.
అయితే ఇదంతా పక్కనే పెడితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది.కెరీర్ మొదటి నుంచి ఇప్పటివరకు ఆమె అందంలో అస్సలు మార్పు రాలేదు.శరీరంలో కూడా ఎటువంటి మార్పు లేదు.ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక వీడియో పంచుకుంది.అందులో తన భర్త తనను సరదాగా చీట్ చేసినట్లు కనిపించాడు.తన దగ్గరికి తన భర్త స్పెషల్ గా నెయ్యితో తయారు చేసిన వడ ను తీసుకొచ్చి అది చాలా టేస్టీగా ఉంది తినమని తనకి ఇస్తాడు.
దాంతో అనిత అది తిని చాలా బాగుంది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడగడంతో వెంటనే తన భర్త ఎక్స్ప్రెషన్స్( Husband Expressions ) మరోలాగా పెట్టి మరో ఫన్నీ వీడియో చూపించాడు.అందులో చేతులు లేని ఒక వ్యక్తి వడను ఒక చేత్తో తీసుకొని మరో చేతి చంకన అద్ది నూనెలో వేస్తున్నట్లు కనిపించింది.ఇక అతడు వడలు చేస్తున్న పద్ధతిని చూస్తే ఎవరికైనా కడుపులో తిప్పుతుందని చెప్పవచ్చు.అంటే తన భార్య కోసం అక్కడి నుంచి ఆ వడ తీసుకొచ్చినట్లుగా ఆ వీడియోలో ఆయన సరదాగా చూపించాడు.
ఆ వీడియో చూసిన వాళ్లంతా దగ్గర నవ్వుకుంటున్నారు.పాపం అనితను తన హస్బెండ్ చీట్ చేశాడు కదా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.