మంచు బ్రదర్స్ గొడవలో మరో ట్విస్ట్.. ఆ షోతో సంబంధం లేదని మనోజ్ అన్నారా?

Huge Twist Manchu Brothers Controversy Details Here Goes Viral In Social Media ,House Of Manchus,Manchu Vishnu Manchu Manoj,sarathi, Mohan Babu,huge Twist Manchu Brothers,huge Twist Manchu Brothers Controversy ,

మంచు విష్ణు మంచు మనోజ్ ( Manchu Vishnu Manchu Manoj )మధ్య విభేదాలు ఉన్నాయని కొన్నిరోజుల క్రితం వైరల్ అయిన ఒక వీడియో వల్ల స్పష్టమైన సంగతి తెలిసిందే.సారథి( sarathi ) అనే ఒక వ్యక్తి ఇంట్లో జరిగిన గొడవ వల్ల ఈ వార్త తెగ వైరల్ అయింది.

 Huge Twist Manchu Brothers Controversy Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

విష్ణు గురించి మనోజ్ గతంలో వెల్లడించిన విషయాలు సైతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.అయితే మోహన్ బాబు( Mohan Babu ) ఈ గొడవ విషయంలో మనోజ్, విష్ణులను మందలించారని ప్రచారం జరిగింది.

అయితే విష్ణు మాత్రం ఒక రియాలిటీ షో కోసం ప్రాంక్ చేశామని చెప్పుకొచ్చారు.ఈ షోకు సంబంధించి మరో ట్విస్ట్ చోటు చేసుకుందని సమాచారం అందుతోంది.

మనోజ్ టీం మెంబర్ ఒకరు చెప్పిన సమాచారం ప్రకారం సారథి ఇంట్లో గొడవ జరుగుతున్న సమయంలో సారథి భార్య మనోజ్ కు ఫోన్ చేయగా మనోజ్ అక్కడికి వెళ్లారని తెలిపారు.మనోజ్ అందుకోసమే వెళ్లారు తప్ప ఎలాంటి షూట్ కోసం వెళ్లలేదని పేర్కొన్నారు.

మనోజ్ ఎలాంటి రియాలిటీ షో చేయడం లేదని అందుకు సంబంధించి వైరల్ అయిన వార్తల్లో సైతం నిజం లేదని ఆ వ్యక్తి చెప్పుకొచ్చారు.ప్రస్తుతం మనోజ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి బిజీగా ఉన్నాడని ఆ వ్యక్తి తెలిపారు.ఆ వ్యక్తి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.విష్ణు గొడవను కవర్ చేయడానికి హౌస్ ఆఫ్ మంచూస్ ను తెరపైకి తెచ్చాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మంచు విష్ణు ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.రియాలిటీ షో నిజం కాదని మనోజ్ కూడా వెల్లడిస్తే మాత్రం విష్ణుపై మరిన్ని విమర్శలు తప్పవు.ఈ మధ్య కాలంలో విష్ణు తరచూ ట్రోలింగ్ కు గురి కావడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.మంచు విష్ణు ప్రస్తుతం సినిమాలలో కూడా ఎక్కువగా నటించడం లేదు.

Huge Twist Manchu Brothers Controversy Details Here Goes Viral In Social Media - Telugu Controversy, Manchu Brothers #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube