జనసేన పోటీ చేయని స్థానాలలో టీడీపీ అలా నష్టం కలగనుందా.. ఏం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పార్టీల పొత్తు నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన( TDP BJP Janasena ) ఏ స్థానం నుంచి పోటీ చేయాలో ఇప్పటికే ఫిక్స్ అయింది.

అయితే జనసేన గాజు గ్లాస్( Janasena Glass Symbol ) గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.

జనసేన పోటీ చేసే స్థానాలలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా జనసేన పోటీ చేయని స్థానాలలో సైతం గాజు గ్లాస్ గుర్తును ఇతరులకు కేటాయించే ఛాన్స్ అయితే ఉంది.ఈ విధంగా చేయడం ద్వారా జనసేన పోటీ చేయని స్థానాలలో ఇండిపెండెంట్ అభ్యర్థులు( Independent Candidates ) గాజు గ్లాస్ గుర్తు ద్వారా పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

ఈ విధంగా జరిగితే పవన్ కళ్యాణ్ అభిమానులు గాజు గ్లాస్ జనసేన గుర్తు కావడంతో ఆ పార్టీకి ఓట్లు వేసే అవకాశం అయితే ఉంది.ఈ విధంగా కూటమికి తీవ్రస్థాయిలో నష్టం కలిగే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.

కూటమి పొత్తు( Alliance )ను ఏ క్షణం ప్రకటించారో తెలీదు కానీ ఆ క్షణం నుంచి అన్నీ ఆవాంతరాలే ఎదురవుతున్నాయి.కూటమికి పొత్తు కలిసొస్తుందో లేదో చూడాల్సి ఉంది.జనసేన సింబల్ ను ఫ్రీ సింబల్ గా చేర్చవద్దని కూటమి కోరుతోంది.

Advertisement

ప్రతి చిన్న విషయానికి టీడీపీ( TDP ) భయాందోళనకు గురవుతూ ఉండటం గమనార్హం.జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించకపోతే నష్టపోక తప్పదు.

జనసేన పార్టీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించకపోవడం వల్లే గుర్తు విషయంలో ఆ పార్టీ ప్రతి సందర్భంలో ఎన్నో విమర్శలను మూటగట్టుకుంటోంది. జనసేన పార్టీ( Janasena Party )కి రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.పవన్ మాత్రం మెరుగైన ఫలితాలు సాధిస్తామని నమ్మకంతో ఉన్నారు.

పవన్ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది.

ప్రభాస్ లేకుండానే సలార్ 2 షూటింగ్.. విడుదల అయ్యేది అప్పుడేనా?
Advertisement

తాజా వార్తలు