ఉచిత పుస్తకాల పంపిణి బారులు తీరిన జనం..!

డిజిటల్ విప్లవం వచ్చాక పుస్తకాలు చదివే( Reading books ) వారి సంఖ్య చాలా తక్కువైంది.

కానీ ఈ కాలంలో కూడా పుస్తకాలు చదివే వారు ఉన్నారు.

ఒకప్పుడు ఈ పుస్తకాలు చదివే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది కానీ మారిన డిజిటల్ కాలానికి అనుగుణంగా వారు మారుతూ వచ్చారు.ఇప్పటికే తాము చదవాలనుకున్న పుస్తకం డిజిటల్ వెర్షన్ ఉందా లేదా అని చూస్తారు.

అయితే ఇప్పటికీ పుస్తకాలు చదివి విషయ జ్ఞానం పెంచుకునే వారు ఉన్నారు.అందుకే బుక్ ఫెయిర్ ఎక్కడ జరిగినా సరే భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు.

అదే ఒకవేళ బుక్స్ ఫ్రీగా( free Books ) ఇచ్చేస్తున్నాం అంటే ఇక ఏమైనా ఉందా.విజయవాడలో అదే సీన్ రిపీట్ అయ్యింది.అక్కడ స్థానిక సర్వోత్తమ గ్రంథాలయం ( Sarvottama Library )వారు ఫ్రీ బుక్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టారు.50వేల బుక్స్ వరకు అక్కడ ఫ్రీగా తీసుకునే అవకాశం ఉంది.రెండు రోజులుగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బుక్స్ ని ఫ్రీగా తీసుకోవాలనే ఉద్దేశంతో బుల్ లవర్స్ అక్కడ బారులు తీరారు.

Advertisement

దాదాపు కిలోమీటర్ వరకు క్యూ లైన్ ఉన్నట్టు తెలుస్తుంది.ఏది ఏమైనా ఫ్రీగా ఇస్తామన్నా చదివే ఆసక్తి ఉన్న వారు మాత్రమే ఇంత శ్రమ పడి ఆ బుక్స్ ని తీసుకుంటారు.

ఇదొకరకంగా మంచి వాతావరణమే అని చెప్పొచ్చు.

Advertisement

తాజా వార్తలు