కేటీఎమ్ 250బైక్‌పై భారీగా ఆఫ‌ర్‌.. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా..!

కేటీఎమ్ ద్విచక్ర వాహనాలకు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ బండి అంటే యువత పడి చస్తూ.

ఉంటుంది.కానీ చాలా మంది ఈ బండి ని కొనుగోలు చేయకపోవడానికి గల కారణం దీని ధర.వేరే మోడళ్ల ధరలతో పోల్చుకుని చూస్తే.ఈ బైక్ ధరలు ఆకాశంలో ఉంటాయి.

ఈ కారణం చేతనే అనేక మంది ఈ ద్విచక్రవాహనం కొని సొంతం చేసుకోవాలని ఉన్నా కానీ కొనే సాహసం చేయరు.ఈ స్పోర్ట్స్ బైక్ ను నడిపేందుకు యువత తెగ ఆసక్తి చూపిస్తారు.

తాము కొనకపోయినా పరవాలేదు కానీ ఒక్కసారైనా ఈ బండిని నడపాలని పరితపిస్తుంటారు.ఇలా అనేక మంది ని కలల బైకుగా ఉన్న కేటీఎం ద్విచక్రవాహనాల ధరలను తగ్గిస్తూ.

Advertisement

బజాజ్ మోటార్స్ నిర్ణయం తీసుకుంది.కరోనా కాలంలో అసలే అమ్మకాలు లేక సంస్థలన్నీ నష్టాల్లో ఉన్నాయని అనుకుంటే బజాజ్ మాత్రం అందరికీ షాక్ ఇస్తూ.

ఈ మోటార్ సైకిల్ ధరను తగ్గించింది.

కానీ ఈ ఆఫర్ లో కూడా ఓ మెలిక పెట్టింది.ఈ ఆఫర్ జీవిత కాలం ఉండదు.కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది.

ఈ ఆఫర్ కావాలనుకునే కస్టమర్లు ఈ కొద్ది సమయంలోనే ద్విచక్ర వాహనాన్ని దక్కించుకోవాలి.ఈ ఆఫర్ జూలై 14 నుంచి ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

పవన్ ప్రమాణ స్వీకారానికి లావణ్య త్రిపాఠి హాజరు కాకపోవడానికి కారణాలివేనా?
చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!

అంతలోగా ఈ బండిని కొన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది.భారతీయ మార్కెట్ లో టూవీలర్ అమ్మకాలు పెంచుకోవాలనే లక్ష్యంతో తాత్కాలికంగా ఈ ఆఫర్ ను పెట్టినట్లు కంపెనీ వెల్లడించింది.దీంతో కేటీఎం బండి ధర 2.3 లక్షలకు దిగొచ్చింది.కేటీఎమ్ బైక్ అంటే పడి చచ్చే యువత ప్రధానంగా ఈ ఆఫర్ సమయంలో కొనుగోలు చేస్తారని అంతా భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు