అక్కడ లియో మూవీ బుకింగ్స్ భారీగా డ్రాప్.. నెగిటివ్ టాక్ ముంచేసిందంటూ?

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి( Vijay ) హీరోగా నటించిన తాజా చిత్రం లియో.ఈ సినిమాకు లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

 Huge-drop In Second Day Leo Box Office Collections, Leo Movie, Trisha , Tiger Na-TeluguStop.com

తాజాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల అయింది.అయితే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది అనుకున్న ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షోకే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది.

యాక్షన్ ఎపిసోడ్స్, విజయ్ యాక్టింగ్ నచ్చిన వాళ్లు లియో సినిమా బాగుంది అంటుంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, లోకేష్ మేకింగ్ కోసం వెళ్లిన వాళ్లు మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు.

Telugu Box, Kollywood, Leo, Tigernageswara, Trisha-Movie

లోకేష్( Lokesh Kanagaraj ) రేంజ్ సినిమా కాదు అనే కామెంట్స్ మార్నింగ్ షో నుంచి స్టార్ట్ అయ్యాయి.దీంతో చాలామంది ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వెళ్లడమే మానేశారు.లియో సినిమాని స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా చేసి ఉంటే అయిపోయేది అనవసరంగా లియో సినిమాని LCUలోకి ఫోర్స్డ్ గా తీసుకోని వచ్చినట్లు ఉంది అనే మాటలు మొదలయ్యాయి.

ఈ వర్డ్ ఆఫ్ మౌత్ అన్ని సెంటర్స్ నుంచి ఒకేలా వస్తుంది.మౌత్ టాక్ తోనే ఈ సినిమా కు భారీగా నష్టం వచ్చినట్లు అయింది.వరల్డ్ వైడ్ మొదటి రోజు 100 కోట్లకి పైగా రాబట్టిన లియో సినిమా 2023లో జవాన్, పఠాన్, ఆదిపురుష్, జైలర్ సినిమాల తర్వాత ఆ ఫీట్ సాధించిన సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది.

Telugu Box, Kollywood, Leo, Tigernageswara, Trisha-Movie

విజయ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని రాబట్టిన లియో సినిమా టాక్ ఆశించిన రేంజులో లేకపోవడంతో సెకండ్ డే కలెక్షన్స్ లో హ్యూజ్ డ్రాప్ కనిపించే అవకాశం ఉంది.ఇప్పటికే మధురై లాంటి మెయిన్ సెంటర్స్ లో 40% బుకింగ్స్ కి పడిపోయింది లియో.నిన్న సాయంత్రం ఫస్ట్ షో నుంచే తెలుగు రాష్ట్రాల్లో భగవంత్ కేసరి బుకింగ్స్ పెరిగాయి.

ఈరోజు టైగర్ నాగేశ్వర రావు( Tiger Nageswara Rao ) రిలీజ్ ఉంది కాబట్టి లియో బుకింగ్స్ మరింత డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది.మొదటి రోజు కలెక్షన్స్ తో పోల్చుకుంటే లియో సినిమాకి దాదాపు 50 శాతం కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించే అవకాశం ఉంది.

మరి విజయ్ ఆ డ్రాప్ కనిపించకుండా ఏమైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి మరి.మొత్తానికి భారీ అంచనాల నడుమ విడుదలైన లియో సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube