కొత్త ఇయర్ బడ్స్ కొనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం.టెక్నాలజీ డెవలప్ అవుతున్న క్రమంలో ఎలక్ట్రానిక్ కంపెనీలు పోటీ పడి మరి మార్కెట్లో కొత్త కొత్త వాటిని లాంచ్ చేయడంతో పాటు, వినియోగదారులను ఆకర్షించడం కోసం అదిరిపోయే ఆఫర్స్ ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు.
తాజాగా ఎలక్ట్రానిక్ ఉపకరణ తయారీ కంపెనీ పిట్రాన్ ఇయర్ బడ్స్ పై భారీ ఆఫర్ ప్రకటించింది.తక్కువ ధరకే ఇయర్ బడ్స్ కొనుగోలు చేయవచ్చు.
పైగా ఈ ఇయర్ బడ్స్ లో పలు రకాల ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.ఇయర్ బడ్స్ చూడడానికి స్టైలిష్ గా ఉంటూ, బ్లూటూత్ 5.1 పై పనిచేస్తుంది.

ఒక్కసారి చార్జింగ్ పెడితే 25 గంటల పాటు పనిచేస్తుంది.ఇందులో ప్రత్యేకంగా మైక్ ఉంటుంది.ఇవి వైర్లెస్ ఇయర్ బడ్స్.
ఇందులో 13mm డైనమిక్ డ్రైవర్ ఉండడంతో అదిరిపోయే ఆడియో దీని ప్రత్యేకం.పైగా టచ్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్, ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ ను ఈ ఇయర్ బడ్స్ కలిగి ఉన్నాయి.ఈ ఇయర్ బడ్స్ ధర రూ.3299 కానీ వినియోగదారులు వీటిని కేవలం రూ.699 కు పొందవచ్చు.అంటే 79% డిస్కౌంట్ నేరుగా పొందవచ్చు.

10 మీటర్లు వైర్లెస్ రేంజ్, 2 స్టెప్ పేరింగ్, లో పవర్ కన్ జప్షన్, స్టీరియో లేదా మోనోబడ్ కేపాబిలిటీ లాంటి అద్భుతమైన ఫీచర్లతో, 30 ఎంఏహెచ్ బ్యాటరీతో అమర్చబడి ఉంటుంది.కేవలం ఒక గంట చార్జింగ్ పెడితే, 25 గంటలు పనిచేస్తుంది.ఇక ముఖ్యంగా గమనించుకోవలసిన విషయం ఏమిటంటే ఏ చార్జర్ పడితే ఆ చార్జర్ తో ఈ ఇయర్ బడ్స్ కు చార్జింగ్ పెడితే ఇయర్ బడ్స్ దెబ్బతినే అవకాశం ఉంది.కేవలం కంపెనీ చార్జర్ తోనే చార్జింగ్ పెడితే ఎక్కువ కాలం పని చేస్తాయి.
ఇయర్ బడ్స్ కొనాలనుకునేవారు ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు.







