వరంగల్ మేడికో ప్రీతి అనే అమ్మాయిని.సీనియర్ విద్యార్థి వేదించడం ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో పోలీసుల విచారణలో సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు తాళలేక ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం జరిగిందని గుర్తించారు.ఈ క్రమంలో వాట్సప్ చాట్ తో పాటు .ప్రీతి గదిలో కొన్ని కీలకమైన ఇంజక్షన్ లు గుర్తించడం జరిగింది.దీంతో వరంగల్ పోలీసులు సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి.
కస్టడీలోకి తీసుకోవడం జరిగింది.

ఇదిలా ఉంటే మెడికో ప్రీతికి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి చేరుకుని.ప్రీతిని పరామర్శించడం జరిగింది.
మేడికో ప్రీతి ఆరోగ్యం పై వైద్యులతో మాట్లాడటం జరిగింది.ప్రీతి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు…ఎక్మో సపోర్ట్ తో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా వైద్యులు అన్ని రకాల ట్రీట్మెంట్ లు అందిస్తున్నారు అనీ తమిళిసై తెలిపారు .ప్రీతి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.







