కృష్ణాజిల్లా వైసీపీ లో భారీ మార్పులు ? అన్ని స్థానాల్లోనూ... 

ఏపీ అధికార పార్టీ వైసీపీలో( YCP ) టికెట్ల కేటాయింపు అంశం పెద్ద గందరగోళంగా మారింది .దాదాపుగా 90% స్థానాల్లో మార్పులు ఖాయం అన్నట్లుగానే జగన్ సంకేతాలు ఇస్తున్నారు.

 Huge Changes In Krishnazilla Ycp In All Places , Ysrcp, Telugudesam, Pavan Kalya-TeluguStop.com

జిల్లాల వారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిపించుకుని పరిస్థితిని వివరిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే ఛాన్స్ లేనివారిని ముందుగానే పిలిచి బుజ్జగిస్తున్నారు .ఎందుకు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నామో,  నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది వివరించే ప్రయత్నం చేస్తున్నారు.ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు వ్యవహారం ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

ఎవరికి ఎప్పుడు జగన్ కార్యాలయం( Jagan ) నుంచి ఫోన్ వస్తుందో అనే టెన్షన్ పడుతున్నారు .ఇప్పటికే అనేక జిల్లాలో ఎవరికి టిక్కెట్లు ఇచ్చేది .ఎవరిని మార్చబోతున్నామనే విషయంలో క్లారిటీ ఇచ్చేశారు.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Janasena, Janasenani, Jogi Ramesh, Pavan Kalyan,

ఇదేవిధంగా కృష్ణా జిల్లాలోనూ నియోజకవర్గ ఇన్చార్జిల మార్పుకు జగన్ శ్రీకరం చుట్టారు .దాదాపు 9 మందిని మార్చేందుకు జగన్ సిద్ధమైనట్లు సమాచారం.ఇన్చార్జిల మార్పు నేరుగా సదరు నేతలతోనే చర్చించి జగన్ సముదాయిస్తున్నారు .ఇక మంత్రులలో చాలామందికి ఈసారి టికెట్ దక్కే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది.వచ్చే ఎన్నికల్లో టిడిపి , జనసేన( TDP, Jana Sena ) కలిసి పోటీ చేయబోతుండడంతో,  ప్రజా బలం ఉన్న వారిని అభ్యర్థులుగా బరిలోకి దింపేందుకు జగన్ నిర్ణయించుకున్నారు.

  దీనిలో భాగంగానే ఉమ్మడి కృష్ణాజిల్లాలో తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను మార్చబోతున్నారు.మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్( Vellampally Srinivas ) ను విజయవాడ సెంట్రల్ కు పంపే ఆలోచనలో జగన్ ఉన్నారు.

జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విజయవాడ తూర్పుకు మార్చాలని చూస్తున్నారు .

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Janasena, Janasenani, Jogi Ramesh, Pavan Kalyan,

అలాగే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీకి.దించాలని నిర్ణయించుకున్నారట.  వైసిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రస్తుత మేయర్ గా ఉన్న రాయన భాగ్యలక్ష్మి ని పోటికి దించనున్నారు .నందిగామలో మొండితోక జగన్మోహన్ రెడ్డికి( Jagan Mohan Reddy ) బదులుగా.  అమర్లపూడి కీర్తి సౌజన్య ను బరిలోకి దించాలని చూస్తున్నారు .మైలవరం నుంచి గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్( Vasantha Krishna Prasad ) ను జగ్గయ్యపేట నుంచి బరిలోకి దించే ఆలోచనలో ఉన్నారు.  తిరువూరు నుంచి రక్షణ నిధిని తప్పించి మాజీ ప్రభుత్వ అధికారి ఒకరిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నారట.

పెనుమలూరు నుంచి గెలిచిన కొలుసు పార్థసారధిని గన్నవరం నుంచి, దేవినేని అవినాష్ ను పెనమలూరు నుంచి పోటీ కి దింపాలని జగన్ నిర్ణయించుకున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube