సూర్యాపేట జిల్లా: 2022-23 సంవత్సరానికి గాను ఇంధన పొదుపు విభాగంలో రాష్ట్రస్థాయిలో సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ డిపోకు వెండి బహుమతి లభించింది.తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వారు అందించే తెలంగాణ స్టేట్ ఎనర్జీ కంజర్వేషన్ అవార్డ్స్ (టిఎస్ఈసిఏ)ను 2022-23 కు సంబంధించిన బుధవారం హైదరాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్,
ఖైరతాబాద్ నందు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో చందన్ మిత్ర చేతుల మీదుగా కోదాడ డిపో తరఫున డిపో మేనేజర్ డి.
శ్రీహర్ష అందుకున్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ డిపో తరఫున డి.సుగుణాకర్ (ఎం ఎఫ్), శివకుమార్(కెఎంపిఎల్), జి.ఎం.రావు (ఎస్డిఐ), కోదాడ డిపో ఉత్తమ డ్రైవర్ ఎస్కే.రంజాన్ పాల్గొన్నారు.







