ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో హృతిక్ రోషన్ కూడా ఒకరు.
కాగా హృతిక్ రోషన్ ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నాడు హృతిక్ రోషన్.
ఇకపోతే హృతిక్ రోషన్ ప్రస్తుతం అప్కమింగ్ బ్యూటీ సింగర్ సబా అజాద్ తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ జంట అనేకసార్లు కలిసి మీడియా కంట కనపడడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది.
అదేవిధంగా ప్రముఖ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీకి కూడా వీరిద్దరూ కలిసి హాజరు కావడంతో ఆ వార్తలు మరింత నిజం అని నమ్మారు అభిమానులు.అయితే వారిద్దరూ రిలేషన్ లో ఉన్న విషయాన్ని ఆ జంట ఇప్పటివరకు అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.
కానీ వీరిద్దరికి సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా వీరిద్దరూ కలిసి త్వరలోనే సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నట్లు వార్తలు కోడే కోస్తున్నాయి.
ముంబై మన్నత్ బిల్డింగ్ లో ఖరీదైన అపార్ట్మెంట్ ను హృతిక్ రోషన్ కొనుగోలు చేశాడట.దాదాపుగా 100 కోట్లకు పైగా చెల్లించే రెండు అపార్ట్మెంట్స్ ను సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ రెండు అపార్ట్మెంట్స్ కూడా మూడు ఫ్లోర్ లో విస్తరించి ఉన్నాయి. జూహు, వెర్సొవా లింక్ రోడ్డు లో ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయి.అయితే సముద్రతీరానికి ఇవి దగ్గరగా ఉండడంతో వీటికి భారీగా చెల్లించారట.ఈ బిల్డింగ్ లోనే హృతిక్ రోషన్ ప్రియురాలు సబా అజాద్ కలసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ వార్తలు నిజా నిజాలు తెలియాలి అంటే రోషన్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే మరి.హృతిక్ రోషన్ సినిమాల విషయానికొస్తే.ప్రస్తుతం ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాకు సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది.







