అంద‌మైన మెరిసే చ‌ర్మానికి నెయ్యి.. ఎలా వాడాలంటే?

నెయ్యి.అంద‌రి ఇళ్ల‌ల్లోనూ దీని వినియోగం కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది.

వంట‌ల్లో విరి విరిగా ఉప‌యోగించే నెయ్యిను కొంద‌రు డైరెక్ట‌ర్‌గా కూడా సేవిస్తుంటారు.

అద్భుత‌మైన రుచి క‌లిగే నెయ్యిలో ఎన్నో పోష‌క విలువ‌లు దాగి ఉన్నాయి.

విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్స్‌, యాంటీఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు ఉన్న నెయ్యి ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ద‌రిచేర‌కుండా చేయ‌గ‌ల‌దు.ఇక నెయ్యి కేవ‌లం ఆరోగ్య ప‌రంగా కాకుండా.

సౌంద‌ర్య ప‌రంగానూ ఉప‌యోగ‌ప‌డ‌తుంది.ముఖ్యంగా చ‌ర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మెరిపించ‌డంలో నెయ్యి సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement
Amazing Benefits Of Ghee For Skin For Glowing Skin, Benefits Of Ghee, Ghee For S

మ‌రి నెయ్యిని చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా.

ఒక బౌల్‌ తీసుకుని అందులో నెయ్యి, శెన‌గ‌పిండి మ‌రియు పాలు వేసి బాగా క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.

ఇర‌వై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై డెడ్ స్కిన్ సెల్స్ పోయి.

కాంతివంతంగా మారుతుంది.

Amazing Benefits Of Ghee For Skin For Glowing Skin, Benefits Of Ghee, Ghee For S
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

అలాగే డ్రై స్కిన్‌తో ఇబ్బంది ప‌డుతున్న వారికి నెయ్యి గ్రేట్‌గా సహాయ‌ప‌డుతుంది.నెయ్యి మ‌రియు బాదం ఆయిల్ రెండూ స‌మానంగా తీసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రామాన్ని స్నానం చేసే పావు గంట ముందు ముఖానికి, మెడ‌కు అప్లై చేసేసి ఆర‌బెట్టుకోవాలి.

Advertisement

అనంత‌రం స్నానం చేయాలి.ఇలా వారానికి మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల‌.

ముఖం మృదువుగా మ‌రియు తేమ‌‌గా మారుతుంది.ఇక క‌ళ్ల చుట్టు ఉండే న‌ల్ల‌టి వ‌ల‌యాలను నివారించ‌డంలోనూ నెయ్యి ఉప‌యోగ‌ప‌డుతుంది.

ప్ర‌తి రోజు నిద్రించే ముందు కొద్దిగా నెయ్యి తీసుకుని.క‌ళ్ల చుట్టు అప్లై చేసి మూడు లేదా నాలుగు నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.

ఉద‌యం లేవ‌గానే చ‌ల్ల‌టి నీటితో క‌ళ్ల‌ను క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే.

న‌ల్ల‌టి వ‌ల‌యాలు త‌గ్గుముఖం ప‌ట్టి క‌ళ్లు ప్ర‌కాశ‌వంతంగా మార‌తాయి.

తాజా వార్తలు