హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే తమలపాకులు.. ఎలా వాడాలంటే?

తమలపాకుల( Betel ) గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తమలపాకులు ఉండాల్సిందే.

అలాగే తమలపాకులు పేరు చెప్పగానే చాలా మందికి తాంబూలమే గుర్తుకు వస్తుంది.అయితే తమలపాకులు ఎన్నో ఔషధ గుణాలు, మరెన్నో పోషకాలు క‌లిగి ఉంటాయి.

అందువల్ల ఆరోగ్యానికి తమలపాకులు ఎంతో మేలు చేస్తాయి.అలాగే కేశ సంరక్షణకు సైతం తోడ్పడతాయి.

ముఖ్యంగా జుట్టు రాలడాన్ని అరికట్టడంలో తమలపాకులు స‌హాయ‌ప‌డ‌తాయి.అందుకోసం తమలపాకుల‌ను ఎలా వాడాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మూడు నుంచి నాలుగు తమలపాకులను తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న తమలపాకులు వేసుకోవాలి.అలాగే రెండు రెబ్బలు కరివేపాకు, రెండు మందారం పువ్వు( Hibiscus )లు మరియు కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల చాలా లాభాలు పొందుతారు.

తమలపాకులు, మందారం, కరివేపాకు, పెరుగు మరియు కొబ్బరి నూనె( Coconut oil) ఇవ‌న్నీ జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి.హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెడతాయి.అలాగే తమలపాకు ఆకులు జుట్టు పెరుగుదలను ఉత్తేజపరుస్తాయి.

ఐదు ప్రముఖ కంపెనీలలో ఐటీ ఉద్యోగాలు.. ఈ యువతి సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే!
హెల్త్‌కి మేలు చేసే దాల్చిన చెక్క‌ను ఎవ‌రెవ‌రు తీసుకోరాదో తెలుసా?

జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.స్కాల్ప్ చికాకు నుంచి ఉపశమనాన్ని అందించ‌డంలో.

Advertisement

చుండ్రు, జుట్టు చిట్ల‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలో కూడా త‌మ‌ల‌పాకు ఆకులు అద్భుతంగా తోడ్ప‌డ‌తాయి.

తాజా వార్తలు