నుదిటిపై వదులుగా మారిన చ‌ర్మాన్ని టైట్‌గా ఎలా మార్చుకోవాలో తెలుసా?

సాధార‌ణంగా కొంద‌రికి ముఖం మొత్తం బాగానే ఉన్నా నుదుటిపై మాత్రం చ‌ర్మం వ‌దులుగా మారి ముడ‌త‌లు ఏర్ప‌డుతుంటాయి.దాంతో ముఖ సౌంద‌ర్యం దెబ్బ తిన‌డ‌మే కాకుండా.

వ‌య‌సు పైబ‌డిన వారిలా కూడా క‌నిపిస్తారు.అందుకే నుదురు మీద చ‌ర్మాన్ని టైట్‌గా మార్చుకునేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ చిట్కాల‌ను పాటిస్తే చాలా అంటే చాలా సుల‌భంగా నుదుటిపై వదులుగా మారిన చ‌ర్మాన్ని టైట్‌గా, అందంగా మార్చుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెర జెల్‌, ఒక స్పూన్ బాదం ఆయిల్‌, రెండు విట‌మిన్ క్యాప్సుల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని నుదుటిపై అప్లై చేసి ప‌ది నుంచి ప‌ది హేను నిమిషాల పాటు స్మూత్‌గా స‌ర్కిల‌ర్ మోష‌న్‌లో మ‌సాజ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా రోజు చేస్తూ ఉంటే కేవ‌లం కొద్ది రోజుల్లోనే నుదుటిపై సాగిన చ‌ర్మం టైట్‌గా మారుతుంది.

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ముల్తానీ మ‌ట్టి, ఒక స్సూన్ వాజిలిన్, అర స్పూన్ బేకింగ్ సోడా, రెండు స్పూన్ల అలోవెర జెల్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని నుదుటిపై ప్యాక్‌లా అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల అనంత‌రం వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

ఇక ఈ రెండు చిట్కాల‌తో పాటుగా మ‌రికొన్ని జాగ్ర‌త్త‌లు కూడా పాటించాలి.ముఖ్యంగా వాట‌ర్‌ను శ‌రీరానికి స‌రిప‌డా అందించాలి.

కంటి నిండా నిద్రపోవాలి.ప్ర‌తి రోజు వ్యాయామాలు, యోగా వంటివి చేయాలి.సిట్ర‌స్ ఫ్రూట్స్‌ను రోజు తీసుకోవాలి.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

ఒత్తిడికి దూరంగా ఉండాలి.ఫాస్ట్ ఫుడ్స్‌, బేక‌రీ ఫుడ్స్ తీసుకోవ‌డం త‌గ్గించాలి.

Advertisement

మ‌రియు మ‌ద్య‌పానం, ధూమ‌పానం అల‌వాట్ల‌ను పూర్తిగా మానుకోవాలి.త‌ద్వారా నుదురే కాదు ముఖ చ‌ర్మం మొత్తం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా మెరుస్తుంది.

తాజా వార్తలు