వేసవి సెలవులు( Summer Holidays ) వచ్చాయంటే చాలు, పిల్లలు పీకి పందిరేస్తారు.వేసవికాలంలో పిల్లలు ( Children ) ఇంటి వద్ద ఉండటంతో మరీ ముఖ్యంగా తల్లులకు పెద్ద సవాలుగా మారుతుంది.
ఎందుకంటే ప్రతిక్షణం వారిని కనిపెట్టుకుని ఉండడం కత్తిమీద సాములాగా ఉంటుంది.వారు చేసే అల్లరి భరించడం మగవాళ్ల వలన కాదంటే మీరు నమ్మితీరాల్సిందే.
పిల్లలకు రోజంతా బోర్ కొట్టకుండా, అదే పనిగా వారు చేసే అల్లరిని భరిస్తూ, వారు ఎండలో ఆడకుండా, మట్టిలో దిగకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లులపై ఉంటుంది.
అందుకే పిల్లలతో మీరు ఈ సమ్మర్ సీజన్ ఎలా గడపాలో ఇక్కడ తెలుసుకుందాం.పిల్లలతో ఆడుకోవడానికి తల్లిదండ్రులు( Parents ) ఖచ్చితంగా సమయాన్ని వెచ్చించాలి.ఓ నిర్దిష్టమైన సమయంలో వారితో మీరు కూడా ఆడాలి.
అప్పుడు పిల్లలు కూడా అదే టైం టేబుల్ ప్రకారం ఆడుకునేలాగా వారి బ్రెయిన్ పనిచేస్తుంది.ముఖ్యంగా పిల్లలు టీవీ చూడకుండా, మొబైల్ చూడకుండా వారిని ఫిజికల్ గేమ్స్ వైపు మోటివేట్ చేస్తే ఇంకా మంచిది.
ముఖ్యంగా సాయంకాలం పూట పిల్లలకు కరాటే, స్విమ్మింగ్, డ్రాయింగ్, క్రికెట్, చెస్ వంటి యాక్టివిటీస్ లో శిక్షణ ఇప్పించడం వల్ల వారు బోర్ ఫీల్ అవ్వరు.
ఇక వారి అల్లరిని తట్టుకోలేక వారికి అదేపనిగా స్మార్ట్ ఫోన్ మీరు ఇచ్చినట్లయితే పిల్లలకు దృష్టిలోపం కలిగే అవకాశం ఉంది.అందుకే పిల్లలకు మొబైల్ ఫోన్ బదులు మంచి కథల పుస్తకాలు, డ్రాయింగ్ పుస్తకాలు కొనివ్వండి.అలాగే వారిలో సృజనాత్మకతను వెలికి తీసేలా వారితో బొమ్మలు కూడా వేయించండి.
లేదా ఇతర కళలను నేర్పించండి.అంతే తప్ప స్మార్ట్ ఫోన్ ఇచ్చి వారి భవిష్యత్తును పాడు చేయకండి.
మీ పూర్వీకులు పల్లెటూర్లలో ఉన్నట్లయితే వేసవి సెలవుల్లో పిల్లలను వారి అమ్మమ్మ లేదా నాయనమ్మ ఇంటికి పంపించేందుకు ప్రయత్నించండి.