సోషల్ మీడియా మాయలో పడి యువత తులతూగుతోంది.ఈ క్రమంలో కొంతమంది దానికి బానిసలు అవుతుంటే, మరికొందరు దానిని ఉపయీగించుకొని పైకి వస్తున్నారు.
మరీ ముఖ్యంగా కొందరు యువతీయువకులు సోషల్ మీడియాని ఆసరాగా చేసుకొని ఎక్కడపడితే అక్కడ రెచ్చిపోతున్నారు.తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
రైల్వే స్టేషన్ల( Railway stations )లో రీసెంట్ గా ఓ అమ్మాయి చేసిన డాన్స్ ( Girl dance )జనాల్ని బెంబేలెత్తించింది.దాంతో ఇదేం పబ్లిసిటీ పిచ్చి రా బాబు.
అని జనాలు ఆమె ముఖం మీద ఉమ్మేసిన పరిస్థితి.

రైల్వే స్టేషన్లు ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటాయి.ముఖ్యంగా ప్లాట్‌ఫామ్( Platform ) మీద రైలు ఎక్కేవారు దిగేవారు హడావిడిలో ఉంటారు.అలాంటి సమయంలో ఓ అమ్మాయి చిత్ర విచిత్రమైన స్టెప్పులతో జనాలకి అడ్డం పడుతూ హడలెత్తించింది.
ఈ వీడియోను కొందరు ‘మీ స్నేహితులతో పంచుకోండి’ అనే కాప్షన్ తో షేర్ చేయగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.ఇక ఈ స్టేషన్ పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్‌గా తెలుస్తోంది.

ఇక ఈ అమ్మాయి కూడా అదే ప్రాంతానికి చెందిన అమ్మాయి అయి ఉంటుందని సమాచారం.ఏది ఎలాగున్నా ఆమె అక్కడ స్టేషన్‌లో చేసిన డ్యాన్స్ హంగామా వలన రైల్వే అధికారులు కూడా ముచ్చెమటలు పెట్టారంటే మీరు నమ్మితీరాలి.ఈ వీడియోని చూసిన నెటిజన్లు చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు.ఇలాంటి డ్యాన్స్‌లను తట్టుకోవడం మావల్ల కాదని కొందరంటే, కొంచెం ఆమెను ఎవడికన్నా చూపించండిరా బాబు అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
అయితే కొంతమంది ఆమెకి మద్దతుగా ఇలా డ్యాన్స్ చేయాలంటే ఎన్ని గట్స్ ఉండాలో అని కామెంట్స్ పెడుతున్నారు.







