మార్కెట్లో దొరికే సబ్బుల గురించి ఆయా కంపెనీలు ఎంత డబ్బా కొట్టినా, చర్మానికి సబ్బులు మంచి నేస్తాలు కావు.సాధ్యమైనంతవరకు సబ్బులని పక్కనపెట్టి, సహజమైన వనరులతోనే ఒంటిని శుభ్రం చేసుకోవడం మంచి పధ్ధతి.
అలాకాదు, సబ్బు కావాల్సిందే అంటే, బయటి సబ్బులు వాడకుండా, మీరే ఇంట్లో ఓ సబ్బు తయారు చేసుకోండి.అది కూడా కలబందతో.
ఎలానో చూడండి.
* మొదట ఓ చిన్ని గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకోని మరగబెట్టండి.
మరుగుతున్న నీటిలో కొంచెం కాస్టిక్ సోడా వేసి కలపండి.
* మరోవైపు కలబంద తీసుకొని గుజ్జునంతా బయటకు తీయండి.
* కొబ్బరి నూనె, ఆల్మండ్ ఆయిల్, కాస్టర్ ఆయిల్ మరిగిన నీటిలో కలపండి.చర్మం యొక్క తేమను కాపాడేందుకు ఈ ఆయిల్స్ వాడుతున్నాం అన్నమాట.
* ఆ తరువాత కలబందని ఈ మిశ్రమంలో కలిపి, మంచి సువాసన కోసం లావెండర్ ఆయిల్ కొన్ని చుక్కలు పోయండి.
* సబ్బు ఆకారంలో ఉన్న ఏదైనా ఒక పాత్రలోకి మిశ్రమాన్ని తీసుకోని, అది చల్లబడిన తరువాత రాత్రి ఫ్రిజ్ లో పెట్టండి.
తెల్లారేసరికి మీ మిశ్రమం గట్టిపడి సబ్బులా తయారు అవుతుంది.ఇంకేం .ఎలాంటి కెమికల్స్ లేని నేచురల్ సబ్బు రెడి.