గర్భిణులు చివరి నెలల్లోకి అడుగుపెట్టగానే మొదలయ్యే సమస్యల్లో కాళ్ళు వాపులు రావడం ఒకటి.పిండం ఎదుగుదల కోసం శరీరం ఎక్కువగా నీరు ఉత్పత్తి చేస్తుంది.
ఆ అదనపు నీరు పాదాల్లోకి చేరిపోవడం వలన కాళ్ళు వాపులు వస్తాయి.ఈ సమస్యని తగ్గించుకోవాలంటే మేం చెప్పే టిప్స్ పాటించండి.
* మంచి డైట్ పాటించడం కంపల్సరి.ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.
అలాగే ఉప్పు, పంచదార తీసుకోవడం తగ్గించాలి.
* 8 గ్లాసుల నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి.
ఈ సమయంలో టాక్సిన్స్ లెవెల్స్ బాడిలో ఎక్కువగా ఉండకూడదు.అలాగే ఎక్కువున్న సోడియం లెవెల్స్ కూడా పడిపోతాయి.
* ఎడమవైపు తిరిగి పడుకోవడం బెటర్.అలాగైతే వీన్స్ మీద ఎక్కువ ఒత్తిడి ఉండదు.
దాంతో శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి వాపులు తగ్గుతాయి.
* ఎక్కువసేపు నిల్చొని ఉండకూడదు.
అలాగాని ఎక్కువసేపు కూర్చొని కూడా ఉండకూడదు.స్థీరంగా ఒక చోట ఉండిపోకుండా చిన్ని చిన్ని విశ్రామాలిస్తూ కదులుతూ ఉండాలి.
* మంచి చెప్పులు లేదా షూస్ వాడటం కూడా ఉపయోగపడుతుంది.మార్కెట్లో ప్రత్యేకంగా ఇలాంటి షూస్ ఉంటాయి.
డాక్టర్ ని సంప్రదించి వాడాలి.