ట్రై వన్స్‌.. ఏసీ, కూలర్‌ లేకున్నా ఈ ప్రయత్నాలు చేస్తే ఇంట్లో చల్లన్ని వాతావరణం ఉంటుంది

నేటితో ఫిబ్రవరి ముగియబోతుంది.రేపటి నుండి మార్చి ప్రారంభం కానుంది, మార్చి ఆరంభంతోనే ఎండలు మరింతగా ముదరనున్నాయి.

 How To Keep Your Room Cool In Summer With Out Ac And Cooler-TeluguStop.com

గతంతో పోల్చితే ఈసారి మార్చిలోనే ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ వారు చెబుతున్నారు.ఇక ఏప్రిల్‌, మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అత్యంత వేడితో దుమ్ము లేచి పోవడం ఖాయం.ఈ ఎండకాలంలో ఉన్న వారు ఏసీల్లోంచి వెళ్లరు, మిడిల్‌ క్లాస్‌ వారు కూలర్లు వేసుకుని కాలం వెళ్లదీస్తారు.

కాని కొందరు మాత్రం కనీసం కూలర్లు కూడా కొనలేని పరిస్థితి ఉంటుంది.అలాంటి వారు ఈ చిన్న చిట్కాలను వాడుకుని ఇంటిని కూల్‌ గా ఉంచుకోవచ్చు.

చిన్న పాటి స్లాబ్‌ ఇంటి వారు వారి ఇంటిపై కూల్‌ సిమెంట్‌ కోటింగ్‌ లేదా కూల్‌ పెయింట్‌ అని దొరుకుతుంది.తక్కువ ఖర్చుతోనే దాన్ని ఇంటి పైన స్లాబ్‌ కు వేయించడం వల్ల సగం వేడి అనేది తగ్గుతుంది.

స్లాబ్‌ బాగా వేడి కాకుండా ఆ కోటింగ్‌ చూసుకుంటుంది.ఒక వేల కోటింగ్‌ లేకుంటే స్లాబ్‌ బాగా వేడి అయ్యి సీలింగ్‌ ఫ్యాన్‌ తిరుగుతుంటే ఆ వేడి మరింతగా పెరిగి ఇంట్లో ఉన్న వారి పరిస్థితి గందరగోళం అవుతుంది.

అందుకే స్లాబ్‌కు కూల్‌ కోటింగ్‌ చేయించడం మంచిది.

ఇంటికి ఎన్ని తలుపులు, కిటికీలు ఉన్నా కూడా వాటన్నింటికి కొబ్బరి మ్యాట్‌ లేదా జనపనార మ్యాట్‌ లను వేయాలి.అలా వేసి గంట లేదా రెండు గంటలకు ఒకసారి ఆ మ్యాట్‌లు పూర్తిగా తడిచే మాదిరిగా నీటిని చల్లాలి.అలా ఇల్లు చాలా కూల్‌ అవుతుంది.

ఉదయాన్నే చల్లగాలి ఇంట్లోకి వచ్చేలా అన్ని తలుపులు, కిటికీలు ఓపెన్‌ చేసి పెట్టాలి.ఎండ మొదలయ్యే సమయానికి అన్ని క్లోజ్‌ చేయాలి.అలా చేయడం వల్ల ఇంట్లో ఉండే వేడి అనేది ఉదయానే బయట ఉన్న కూల్‌ వాతావరణంకు చల్లబడి పోతుంది.సాయంత్రం సమయంలో కూడా ఓపెన్‌ చేసుకోవడం బెటర్‌.

అయితే సాయంత్రం దోమలు వస్తాయనుకునే వారు ఉదయం పూట ఇంటిని కూల్‌ చేసేందుకు డోర్స్‌ అన్ని ఓపెన్‌ చేసుకోవాలి.

గోడలకు కూడా కొన్ని రకాల కంపెనీల పెయింట్స్‌ దొరుకుతాయి, అవి వేసుకుంటే కూలింగ్‌ ఇస్తాయి.వాటిని వాడటం బెటర్‌.

వేసవిలో సీలింగ్‌ ఫ్యాన్స్‌ కంటే టేబుల్‌ ఫ్యాన్స్‌ను వాడటం ఉత్తమం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube