ముఖంపై మొటిమలు మచ్చలు అసహ్యంగా కనిపిస్తున్నాయా.. మందారంతో వదిలించుకోండిలా!

సాధారణంగా కొందరికి ముఖం ఎంత తెల్లగా ఉన్నా కూడా చర్మంపై అక్కడక్కడ ఏర్పడే మొటిమలు, మచ్చలు( Acne ) అందాన్ని మొత్తం పాడుచేస్తాయి.

మొటిమలు మచ్చలతో కూడిన ముఖాన్ని అద్దంలో చూసుకోవడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.

వాటి నుంచి విముక్తి పొందడం కోసం రకరకాల క్రీములు వాడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు మందారం( Hibiscus ) చాలా బాగా సహాయపడుతుంది.మందారం పువ్వుల్లో ఉండే పలు సుగుణాలు మొటిమలు మరియు మచ్చలు నివారించడంలో సమర్థవంతంగా పని చేస్తాయి.

మరి ఇంతకీ మందారాన్ని చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మందారం పొడి వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ శనగ పిండి,( Gram Flour ) హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి,( Rice Flour ) వన్ టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, కావాల‌ని అనుకుంటే మెడ‌కు కూడా అప్లై చేసుకుని ప‌దిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Advertisement

ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే ముఖంపై ఎలాంటి మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.

మొటిమలు రెండు రోజుల్లోనే మాయం అవుతాయి.అలాగే మందారం, శనగ పిండి, బియ్యం పిండి, పెరుగు, తేనెలో ఉండే సుగుణాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన దుమ్ము ధూళిని తొలగిస్తాయి.

ముఖాన్ని అందంగా కాంతివంతంగా మెరిపిస్తాయి.కాబట్టి మొటిమలు మచ్చలు లేని అందమైన మెరిసే చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా పైన చెప్పుకున్న సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.

బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..
Advertisement

తాజా వార్తలు