స్మార్ట్ ఫోన్ యూజర్లకు డబ్బులు సంపాదించుకునే అద్భుతమైన అవకాశం గూగుల్( Google ) అందుబాటులోకి తీసుకొచ్చింది.గూగుల్ ఒపినియన్ రివార్డ్స్ యాప్( Google Opinion Rewards ) ద్వారా స్మార్ట్ ఫోన్ యూజర్లు ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించుకోవచ్చు.
వాటిని సెకన్ల వ్యవధిలోనే మీ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవచ్చు.ఈ యాప్‌లో మీరు కొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
ప్లే స్టోర్‌లో ఇలాంటి డబ్బు సంపాదించే యాప్‌లు, గేమ్‌లు చాలా అందుబాటులో ఉన్నాయి.వాటి నుండి మీరు డబ్బు సంపాదించవచ్చు, అయితే వీటిలో కొన్ని యాప్‌లు మరియు గేమ్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి డబ్బు ఖర్చు అవుతుంది.
వాటిలో డబ్బులు కొంత ఖర్చు పెడితేనే డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది.

అయితే గూగుల్ ఒపినియన్ రివార్డ్స్ యాప్‌ను ఉపయోగించి మనం ఎటువంటి ఖర్చు లేకుండానే డబ్బు ఆర్జించవచ్చు.గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్ యాప్ అనేది గూగుల్ సర్వే యాప్.( Google Survey App ) దీనిలో మీరు సర్వేలు చేయడం ద్వారా రివార్డ్‌లను ( Rewards ) సంపాదించవచ్చు.
ఈ సర్వేలు ఒక రకమైన ప్రశ్న సమాధానం.ఇక్కడ ఒక యూజర్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.గూగుల్ ఒపినియర్ రివార్డ్స్ యాప్‌ను 2016లో గూగుల్ ప్రారంభించింది.కానీ అది స్విట్జర్లాండ్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది.

తర్వాత 2017లో భారతదేశంతో సహా 29 దేశాలలో ప్రారంభించబడింది.ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌లో ఈ యాప్‌ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.ఈ గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్ యాప్ నుండి డబ్బు సంపాదించడం చాలా సులభం.మీరు ఈ యాప్‌లో కొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి, బదులుగా మీకు డబ్బు వస్తుంది.
ఇందులో మీరు ఒక్కో సర్వేను పూర్తి చేస్తే, దానికి సంబంధించిన రివార్డులు పొందొచ్చు.ఆండ్రాయిడ్ యూజర్లు ఆ మొత్తాన్ని తమ గూగుల్ అకౌంట్‌లోని, ఐ ఫోన్ యూజర్లు వాటిని పే పాల్ అకౌంట్‌లోకి జమ చేసుకోవచ్చు.