వాట్సాప్( WhatsApp ) తన యూజర్ ఎక్స్పీరియన్స్ ను మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.గ్రూప్ కాల్స్ లో తలెత్తే అసౌకర్యాలకు చెక్ పెట్టడం కోసం ఓ సరికొత్త అప్డేట్స్ రిలీజ్ చేసింది.
వాట్సప్ వాయిస్ చాట్ ( WhatsApp voice chat )అనే కొత్త ఫీచర్ తో గ్రూప్ లో వాయిస్ కాల్ సైలెంట్ గా చేసుకోవాచ్చు.ఈ ఫీచర్ లార్జ్ గ్రూప్స్ లో మాత్రమే పనిచేస్తుంది.
అంటే గ్రూప్ లో 30 నుంచి 125 మంది మెంబర్స్ ఉన్న గ్రూప్ లో రింగింగ్ నోటిఫికేషన్ లతో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా సైలెంట్ కాల్స్ మాట్లాడుకోవచ్చు.

గ్రూప్ మెంబర్స్ తో వాయిస్ చాట్ ద్వారా చాలా సులభంగా కమ్యూనికేట్ చేయవచ్చు.మాట్లాడడం ప్రారంభించే ముందు కాల్ లో ఇతర మెంబర్స్ చేరే దాకా వేచి ఉండాల్సిన అవసరం లేదు.చాట్ ఆల్రెడీ ప్రారంభం అయిన తర్వాత కూడా ఈ గ్రూప్ కాల్ లో చేరవచ్చు.
ఈ కాల్ గురించి వచ్చే నోటిఫికేషన్ నిశ్శబ్దంగా వస్తుంది కాబట్టి దీన్ని చాలా ఈజీగా ఇగ్నోర్ చేయవచ్చు.ఒక గంటపాటు ఎవరు మాట్లాడకపోతే వాయిస్ చాట్ ఆటోమెటిగ్ గా ముగుస్తుంది.
కాల్స్ ట్యాబ్ చెక్ చేసి వాయిస్ చాట్ లో ఎవరెవరు చేరారు కూడా చూడవచ్చు.ఈ వాట్స్అప్ వాయిస్ చాట్ ఫీచర్ ను ఎలా అప్డేట్ చేసి ఉపయోగించాలో తెలుసుకుందాం.

iOS లేదా ఆండ్రాయిడ్ యూజర్లు( Android users ) లేటెస్ట్ వెర్షన్ కు వాట్సప్ యాప్ ను అప్డేట్ చేసి, ఈ ఫీచర్ పొందవచ్చు.ఆ తరువాత డివైజ్ లో వాట్సప్ ఓపెన్ చేసి, వాయిస్ చాట్ ప్రారంభించాలనుకుంటున్నా గ్రూప్ చాట్ పై ట్యాప్ చేయాల్సి ఉంటుంది.స్క్రీన్ పైన కుడి భాగంలో కనిపిస్తున్న కాల్ ఐకాన్ పై క్లిక్ చేసి, స్టార్ట్ వాయిస్ చాట్ ఎంచుకోవాలి.ఇక గ్రూప్ మెంబర్స్ కు వాయిస్ చాట్ లో చేరమని ఇన్వైట్ చేస్తూ ఓ సైలెంట్ నోటిఫికేషన్ వెళుతుంది.
దీనితో గ్రూప్ మెంబర్స్ తో ఎప్పుడైనా, ఎక్కడైనా, సింగిల్ ఒక ట్యాప్ తో మాట్లాడవచ్చు.