జబర్దస్త్( Jabardasth ) లో కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన ధనరాజ్( Dhanraj ) ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తూనే నటుడిగా మంచి గుర్తింపును పొందుతున్నాడు.ఇక రీసెంట్ గా విమానం అనే సినిమాలో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పుడు సముద్రఖని ని మెన్ లీడ్ గా పెట్టీ ఒక సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా మీద ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి.

ఎందుకంటే ఇది కూడా మరో బలగం( balagam ) అవుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.ఈ సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయింది.ఇక అందులో భాగంగానే ధనరాజ్ కూడా తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొస్తున్నాడు.

ఇక ప్రస్తుతం నటులు అందరూ కూడా డైరెక్టర్లుగా మారుతూ మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు.ఇక అదే బాట లో ధనరాజ్ కూడా డైరెక్టర్ గా చేస్తూనే ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.ఇక అందులో భాగంగానే ఆయన ఇప్పుడు ఈ సినిమా మీదనే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది.
ఇక ఇది తండ్రి కొడుకుల బంధంగా తెరకేక్కుతున్నట్టుగా మరో సమాచారం అందుతుంది.ఇక ప్రతి మనిషిలో ఉండే హ్యూమన్ ఎమోషన్స్ ని బేస్ చేసుకుని ఈ సినిమా రూపొందుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…ఇక ఈ సినిమా ఎంతమేరకు సక్సెస్ అవుతుంది అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి…ఇక ఈ సినిమాతో ధనరాజ్ సక్సెస్ కొడితే మాత్రం ఇక ఆయన కెరియర్ కూడా వేణు కెరియర్ లాగానే సూపర్ సక్సెస్ అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.