టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కమెడియన్లలో ఏవీఎస్ ఒకరనే సంగతి తెలిసిందే.నటుడిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా ఏవీఎస్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు.
తెనాలిలో జన్మించిన ఏవీఎస్ కాలేజ్ లో చదివే సమయంలోనే రంగస్థల ప్రవేశం చేసి ప్రశంసలు అందుకున్నారు.తర్వాత కాలంలో జర్నలిస్ట్ గా పని చేసిన ఏవీఎస్ మిస్టర్ పెళ్లాం సినిమా ద్వారా పాపులారిటీని తెచ్చుకున్నారు.
పవిత్ర ఏవీఎస్ నటించిన చివరి సినిమా కావడం గమనార్హం.500కు పైగా సినిమాలలో ఏవీఎస్ నటించడం గమనార్హం.పలు సినిమాలకు నిర్మాతగా, కొన్ని సినిమాలకు దర్శకుడిగా ఏవీఎస్ వ్యవహరించారు.అయితే ఏవీఎస్ కెరీర్ విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.ఏవీఎస్ కొడుకు ప్రదీప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాన్న కెరీర్ తొలినాళ్లలో జర్నలిస్ట్ గా పని చేశారని ఆ సమయంలోనే ఆయన మిమిక్రీ కూడా చేసేవారని వెల్లడించారు.
నాన్న మిమిక్రీ చేసే సమయంలో బాపు గారు చూసి మిస్టర్ పెళ్లాం మూవీలో ఛాన్స్ ఇచ్చారని తెలిపారు.
నాన్నకు సినిమా ఛాన్స్ లు వచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు వద్దని సూచించారని సినిమా రంగంలో సక్సెస్ కావడం కష్టం కావడంతో అలా చెప్పారని ఏవీఎస్ కొడుకు అన్నారు.నాన్న సినిమా ఆఫర్ల కొరకు షేరింగ్ ఆటోలలో స్టూడియోల చుట్టూ తిరిగేవారని ఆటోకు డబ్బులు లేక నడుచుకుంటూ వెళ్లిన సందర్భాలు ఉన్నాయని ఏవీఎస్ కొడుకు వెల్లడించారు.

ఆ సమయంలో ఇంటి అద్దె చెల్లించడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఏవీఎస్ కొడుకు చెప్పుకొచ్చారు.నాన్న సినీ నటుడు కాకముందు ఎన్నో భయంకరమైన పరిస్థితులను అనుభవించారని ఏవీఎస్ కొడుకు చెప్పుకొచ్చారు.సినిమాల్లో అవకాశాలు రాకపోతే ఎలా అని నాన్న భయపడేవారని ఏవీఎస్ కొడుకు కామెంట్లు చేశారు.ఏవీఎస్ కొడుకు ప్రదీప్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.







