బాలీవుడ్ ప్రేమపక్షులుగా కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న నటుడు విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ గత ఏడాది ఎంతో వైభవంగా వివాహం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ జంట కొన్ని సంవత్సరాల నుంచి వీరి ప్రేమ వ్యవహారం బయటకు తెలియకుండా ప్రేమలో విహరించి 2021లో రాజస్థాన్ లోని పురాతన కోటలో ఎంతో వైభవంగా వీరి వివాహం చేసుకున్నారు.
వయసురీత్యా కత్రినాకైఫ్ కన్నా విక్కీ కౌశల్ చిన్నవాడు అయినప్పటికీ వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు.
కత్రినా కైఫ్ వివాహం తరువాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన భర్త కోసం ఎన్నో రకాల వంటలను వండుతూ తనపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తుంది.
ఈ క్రమంలోనే కత్రినా ఆ వంటకాలు అన్నింటినీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.ఇలా వీరిద్దరూ ఒకరి పై ఒకరు ప్రేమను పెంచుకొని ఎంతో అన్యోన్యంగా గడుపుతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్కీ కౌశల్ తన భార్య కత్రినాకైఫ్ గురించి ప్రశంశల వర్షం కురిపించారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ గురించి మాట్లాడుతూ తన జీవితంలోకి కత్రినాకైఫ్ రావడంతో అద్భుతం జరిగిందని, ప్రతి విషయంలోనూ కత్రినా తనను ఎంతగానో మార్చేసిందని, విక్కీ కౌశల్ వెల్లడించారు.కత్రినా కైఫ్ ఎంతో తెలివైన అమ్మాయి మాత్రమే కాకుండా ఎంతో జాలి హృదయం కలది.అలాంటి అమ్మాయిని భార్యగా పొందడం నేను చేసుకున్న అదృష్టమని అంటూ తన గురించి ఎంత గొప్పగా చెప్పారు.
అలాగే కత్రినా కైఫ్ నుంచి ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తాను తెలుసుకున్నానని తన జీవితాన్ని కత్రినా పూర్తిగా మార్చేసిందని ఈ సందర్భంగా విక్కీ కౌశల్ తన భార్య పై ప్రశంసలు కురిపించారు.







