ఆ విషయంలో నాగార్జున తర్వాత నానినే తోపు.. ఇంతమంది కొత్త డైరెక్టర్లను పరిచయం చేశారా?

సినిమా ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వాలనే మంచి మనస్సు ఉన్న హీరోలు చాలా తక్కువమంది ఉన్నారు.కొత్త డైరెక్టర్లతో పని చేయడం రిస్క్ అని చాలామంది హీరోలు భావిస్తారు.

 How Many New Directors Hero Nani Introduced To Tollywood Details, Hero Nani, Nan-TeluguStop.com

కొంతమంది హీరోలు కొత్త డైరెక్టర్లకు( New Directors ) ఛాన్స్ ఇచ్చి రిస్క్ తీసుకోలేమని డైరెక్ట్ గా చెబుతుండగా మరి కొందరు హీరోలు కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం వల్ల భారీగా ఎదురుదెబ్బలు తగిలాయని చెబుతున్నారు.అయితే నాగార్జున, నాని మాత్రం కొత్త డైరెక్టర్లకు ఆఫర్లు ఇచ్చే విషయంలో ముందువరసలో ఉంటారు.

హాయ్ నాన్న( Hi Nanna ) సినిమాతో నాని ( Nani ) మరో సక్సెస్ ను అందుకున్నారు.ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు తక్కువగానే ఉన్నా రెండో రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లు పుంజుకున్నాయి.

నాని అలా మొదలైంది సినిమాతో నందినీ రెడ్డి( Nandini Reddy ) టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నాగ్ అశ్విన్( Nag Ashwin ) ఇండస్ట్రీకి పరిచయం కాగా నాగ్ అశ్విన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Telugu Nani, Nanna, Nag Ashwin, Nagarjuna, Nandini Reddy, Nani Directors, Direct

నాని నిన్నుకోరి సినిమాతో శివ నిర్వాణ( Shiva Nirvana ) దర్శకుడిగా పరిచయమై వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మతో అః సినిమాను నిర్మించగా ఈ సినిమా మంచి లాభాలను అందించింది.నాని నిర్మించిన హిట్ సినిమాతో శైలెష్ కొలను( Sailesh Kolanu ) దర్శకుడిగా పరిచయమయ్యారు.దసరా సినిమాతో నాని శ్రీకాంత్ ఓదెలను( Srikanth Odela ) ప్రేక్షకులకు పరిచయం చేయడం జరిగింది.

Telugu Nani, Nanna, Nag Ashwin, Nagarjuna, Nandini Reddy, Nani Directors, Direct

నాగార్జునలా( Nagarjuna ) నాని సైతం ఎక్కువ సంఖ్యలో కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. నాని రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ స్థాయిలో ఉంది.నాని తర్వాత ప్రాజెక్ట్ లతో ఒకింత భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.న్యాచురల్ స్టార్ నాని రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube