ప్రతీ ఏడాది టాలీవుడ్ లో సంక్రాంతి( 2024 Sankranti ) వార్ జరుగుతూనే ఉంటుంది.స్టార్ హీరోల బిగ్గెస్ట్ క్లాష్ అనేది తప్పడం లేదు.2023లో కూడా సంక్రాంతికి బిగ్ ఫైట్ జరిగింది కానీ స్టార్ హీరోలు కాకుండా సీనియర్ స్టార్ హీరోలు ఈ సంక్రాంతికి తమ సినిమాలతో వచ్చి తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ఇక 2024 సంక్రాంతి ఫైట్ కోసం ఇప్పటి నుండే వార్ మొదలయ్యింది.
వచ్చే ఏడాది పండుగకు బిగ్గెస్ట్ క్లాష్ ఉండనుంది.ఇప్పటికే పలు సినిమాలు అఫిషియల్ గా డేట్స్ ను లాక్ చేసుకోగా మరికొన్ని భారీ సినిమాలు సంక్రాంతి కోసం రెడీ అవుతున్నాయి.
ముందుగా 2024 సంక్రాంతి సీజన్ లో స్లాట్ ను రిజర్వ్ చేసుకుంది మాత్రం ప్రభాస్.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమా( Project K ) సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 సినిమాను 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.ఇక ఈ మధ్య మాస్ మహారాజ రవితేజ ఈగల్( Raviteja Eagle ) కూడా రానుంది అని ప్రకటించారు.అలాగే మెగాస్టార్, కళ్యాణ్ కృష్ణ మూవీ కూడా ఇదే రేస్ లో ఉండబోతుంది అని టాక్ వస్తుంది.
వీటితో పాటు తాజాగా హనుమాన్ సినిమాను( Hanuman Movie ) కూడా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ఈ రోజు అఫిషియల్ గా ప్రకటించారు.అలానే నాని 30వ సినిమా, విజయ్ – పరశురామ్ మూవీ కూడా సంక్రాంతికే అని అంటున్నారు.వీటిపై మేకర్స్ అఫిషియల్ అప్డేట్ ఇస్తే కానీ క్లారిటీ రాదు.
ఇన్ని సినిమాలు కనుక 2024 సంక్రాంతి రేస్ లో ఉంటే బాక్సాఫీస్ దగ్గర మాములుగా ఉండదు.మరి ఆ సమయానికి బరిలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో వేచి చూడాల్సిందే.