వామ్మో ...కళ్ళు చెదిరే రేంజ్ లో ఆస్తులు కూడపెట్టిన సంయుక్త మీనన్... ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

పాప్ కార్న్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు కేరళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ (Samyuktha Menon) .అయితే ఈమె తమిళంలో కన్నా తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ తెలుగులో అద్భుతమైన విజయాలని అందుకుంటూ స్టార్ హీరోయిన్గా సక్సెస్ సాధించారు.

 How Many Assets Samyuktha Menon Acquired Details, Samyuktha Menon,kalyan Ram,dev-TeluguStop.com

ఇలా సంయుక్తమైన భీమ్లా నాయక్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి.

ఇలా సార్, బింబిసారా వంటి సినిమాలతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో తాజాగా విరూపాక్ష సినిమా(Virupaksha Movie) ద్వారా మరో మంచి హిట్ అందుకున్నారు.ఇకపోతే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంయుక్త మీనన్ ఇండస్ట్రీలో ప్రస్తుతం తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమాలు చేస్తున్నారు.తాను నటించిన సినిమాలు వరుసగా సక్సెస్ కావడంతో ఈమె రెమ్యూనరేషన్ కూడా పెంచారని తెలుస్తోంది.

అయితే ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత సంయుక్త మీనన్ కూడపెట్టిన ఆస్తుల గురించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా సంయుక్త ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ ఎంత మొత్తంలో ఆస్తులు కూడ పెట్టింది అనే విషయాన్ని వస్తే… దాదాపు పది కోట్ల రూపాయల మేర ఆస్తులను కూడా పెట్టారని సమాచారం.సంయుక్త మీనన్ జన్మించిన పాలక్కాడ్ లో తనకు ఓ ఖరీదైన ఇల్లు ఉన్నట్లు తెలుస్తుంది.అయితే తాజాగా హైదరాబాద్లో కూడా ఈమె ఓ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారని సమాచారం.

అలాగే సంయుక్త మీనన్ వద్ద 80 లక్షల విలువ చేసే మెర్సండెజ్ బెంజ్ కారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఇలా వీటి విలువ సుమారు 10 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.

ఇక సినిమాల విషయానికొస్తే ఈమె తిరిగి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) సరసన డెవిల్ (Devil)అనే సినిమాలో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube