యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా హిందీ, తెలుగులో రూపొందిన ఆదిపురుష్ ( Adipurush )చిత్రం జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్న కారణంగా ప్రమోషన్ కార్యక్రమాలను భారీ ఎత్తున దర్శకుడు ఓం రౌత్ ప్లాన్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ కేటాయించిన డేట్స్ కొన్నే.షూటింగ్ మొత్తం గ్రీన్ మ్యాట్ పైనే పూర్తి చేశారు.
కనుక ప్రమోషన్ కార్యక్రమాల కోసం ప్రభాస్ ఎక్కువ రోజులు కేటాయించే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతుంది.

మే 15 నుండి మొదలుకొని సినిమా విడుదల అయ్యే వరకు పూర్తిగా ఆదిపురుష్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలతోనే ప్రభాస్ బిజీగా ఉండే అవకాశాలున్నాయి.జూన్ 16వ తారీఖున ఈ సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే.అంటే నెల రోజుల పాటు ప్రభాస్ ఆదిపురుష్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటాడు.

దేశ వ్యాప్తంగా అనేక ముఖ్య పట్టణాల్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ తో పాటు మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలు ఇలా ఎన్నో కార్యక్రమాలను చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ట్రైలర్ రిలీజ్ కోసం భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది.అందులో కొన్నింటికి టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు.

ముఖ్యంగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి( Rajamouli ) ఏదైనా ఒక ఈవెంట్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రభాస్ కాంపౌండ్ నుండి వార్తలు వస్తున్నాయి.ఆదిపురుష్ సినిమా పట్ల రాజమౌళి చాలా ఆసక్తిగా ఉన్నట్లు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కనుక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో రాజమౌళి ఏదో ఒక విధంగా భాగస్వామ్యం అయ్యే అవకాశాలున్నాయి.
రాముడి పాత్ర లో ప్రభాస్ ని చూడబోతున్నాం అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.తప్పకుండా ఈ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్స్ దక్కించుకోబోతుంది అనే నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.