స్లిప్పర్స్‌కు హ‌వాయి అనే పేరు ఎలా వ‌చ్చింది? ఇంటింటికీ అది ఎలా చేరిందో తెలిస్తే..

హవాయి చప్పల్స్ మన జీవితంలో ముఖ్యభాగ‌మైపోయాయి.కాలంతో పాటు దీని డిజైన్లు కూడా మారాయి.

ఇప్పుడు మునుపటి కంటే చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నాయి.అయితే దీనికి హవాయి చప్పల్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.హ‌వాయి చెప్ప‌ల్‌ను ప్రపంచంలోని వివిధ దేశాలలో ప‌లు పేర్లతో పిలుస్తారు.

భారతదేశంలో హవాయి చప్పల్ అని పిలుస్తారు.చైనా, ఈజిప్ట్, జపాన్ మరియు అమెరికాతో సహా అనేక దేశాలలో ఇటువంటి చెప్పులు క‌నిపిస్తాయి.

అయితే హవాయి అనే పదం ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో తెలుసా? చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం హవాయి చెప్పులు అనే పేరు.అమెరికాలో ఉన్న హవాయి ద్వీపం నుంచి వ‌చ్చాయి.

Advertisement

ఈ ద్వీపంలోని టి అనే చెట్టుకున్న‌ రబ్బరు నుంచి చెప్పులు తయారు చేస్తారు.అందుకే వీటిని హవాయి చప్పల్స్ అంటారు.అలాగే ఈ చెప్పులు గాలిలా తేలికగా ఉంటాయి క‌నుక వీటికి హవాయి చప్పల్ అనే పేరు వ‌చ్చింది.1880వ సంవత్సరంలో జపాన్‌లోని గ్రామీణ ప్రాంతాల నుండి కూలీలను.కర్మాగారాల్లో పని చేయించ‌డానికి అమెరికాలోని హవాయి దీవులకు తీసుకువచ్చారని చ‌రిత్ర చెబుతోంది.

హవాయి చప్పల్ పేరు ప్రసిద్ధి చెందడం వెనుక హవాయినాజ్ హస్తం ఉందని చెబుతారు.హవయానాస్ అనేది బ్రెజిలియన్ షూ బ్రాండ్.1962 వ సంవత్సరంలో హవాయంజ్ రబ్బరు స్లిప్పర్లను విడుదల చేసింది.భారతదేశంలో ఇంటింటికీ చెప్పులు తీసుకెళ్లిన‌ ఘ‌న‌త‌ బాటాదేన‌ని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు